నయన్ బ్రాండ్‌కు అసలైన పరీక్ష!

గత కొన్నేళ్లుగా న‌య‌న‌తార కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్ట‌ర్లు, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను విస్తరించుకున్నారు.

Update: 2026-08-08 06:25 GMT

స్టార్ హీరోల మధ్య బాక్సాఫీస్ పోటీలు సాధారణమే. కానీ ఒకే స్టార్ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు దాదాపు ఒకే టైమ్ లో థియేటర్లలోకి రావడం మాత్రం అరుదుగా జరిగే విషయం. అలాంటి పరిస్థితిని ఇప్పుడు నయనతార ఎదుర్కొంటున్నారు. ఇది కేవలం రిలీజ్ డేట్ ల యాదృచ్ఛికం మాత్రమే కాదు.. ఆమె బ్రాండ్ పవర్, నటిగా ఉన్న వెర్సటిలిటీ, ఆడియ‌న్స్ లో ఆమెకున్న ప‌ర్స‌న‌ల్ మార్కెట్ పై ఇంట్రెస్టింగ్ డిస్క‌ష‌న్ కు కార‌ణ‌మ‌వుతోంది.

న‌య‌న‌తార హీరోయిన్ గా న‌టించిన హాయ్ సినిమా, య‌ష్ హీరోగా ఆమె కీల‌క‌పాత్ర‌లో న‌టించిన టాక్సిక్ సినిమాలు రోజుల వ్య‌వ‌ధిలో రిలీజ‌వ‌డం, ఈ రెండు సినిమాల్లో నయనతార కనిపించే పాత్రల స్వభావం పూర్తిగా భిన్నంగా ఉండటం విశేషం. ఒక సినిమాలో ఆమె కథను ముందుకు నడిపించే మెయిన్ హీరోయిన్ గా క‌నిపించ‌నుండ‌గా, మ‌రో సినిమాలో భారీ కాస్టింగ్ మ‌ధ్య కీలక పాత్రను పోషిస్తున్నారు. ఒకవైపు రొమాంటిక్ కామెడీ వాతావరణం, మరోవైపు యాక్షన్ ఓరియెంటెడ్ భారీ ప్రాజెక్ట్.. ఈ రెండు జానర్ల మధ్య ఆమె యాక్టింగ్ ప‌రంగా ఆడియ‌న్స్ కు ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ వారికి కొత్త ఎక్స్‌పీరియెన్స్ ను ఇవ్వొచ్చు.

గత కొన్నేళ్లుగా న‌య‌న‌తార కేవలం కమర్షియల్ హీరోయిన్‌గానే కాకుండా, కథకు ప్రాధాన్యం ఉన్న క్యారెక్ట‌ర్లు, ఉమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ తన కెరీర్‌ను విస్తరించుకున్నారు. ఇప్పుడు ఒకే వారంలో రెండు సినిమాల్లో రెండు భిన్నమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకు రావడం, ఆ ఇమేజ్‌కు మరో పరీక్షగా మారింది. ఒకే హీరోయిన్ రెండు వేర్వేరు ఎమోష‌న‌ల్ వ‌ర‌ల్డ్స్ లో ఒకే టైమ్ లో ఆడియ‌న్స్ ను మెప్పించ‌గ‌ల‌రా అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. ఈ రిలీజుల నేపథ్యంలో మరో అంశం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. యాక్షన్ సినిమా ఆడియ‌న్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఆడియ‌న్స్ ఎప్పుడూ ఒకే కేటగిరీలో ఉండ‌రు. అందువల్ల ఈ రెండు సినిమాలు పరస్పరం ఒకదాన్ని ఒకటి పూర్తిగా ప్రభావితం చేస్తాయా లేదా వేర్వేరు ఆడియన్స్ సెగ్మెంట్లను ఆకర్షిస్తాయా అన్నది బాక్సాఫీస్ పరంగా కీలక అంశంగా మారింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియ‌న్స్, ఉమెన్ ఆడియ‌న్స్ రెస్పాన్స్ ఈ పరిస్థితిలో నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది.

ఇక నయనతార కెరీర్‌ను పరిశీలిస్తే, ఒకే వారంలో ఇంత విభిన్న స్థాయిలో రెండు సినిమాలు రిలీజ‌వ‌డం చాలా అరుదైన పరిణామంగా చెప్పవచ్చు. సాధారణంగా స్టార్ హీరోయిన్ల సినిమాలు రిలీజుల‌ మధ్య గ్యాప్‌తో వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆమె నటిగా రెండు భిన్నమైన రూపాల్లో ప్రేక్షకుల ముందుకు రావడం, కెరీర్‌లో ప్రత్యేక అధ్యాయంగా నిలిచే అవకాశముంది. బాక్సాఫీస్ రిజ‌ల్ట్స్ ఎలా ఉన్నా, ఈ సిట్యుయేషన్ నయనతార ప‌ర్స‌న‌ల్ మార్కెట్‌ను కొలిచే అరుదైన సందర్భంగా చెప్పొచ్చు. ఒకే సమయంలో పూర్తి స్థాయి హీరోయిన్‌గా, కీలక పాత్ర‌లోనూ ఆడియ‌న్స్ ను ఆకట్టుకోగలిగితే, అది ఆమె స్టార్‌డమ్ కంటే నటిగా ఆమెకున్న స్థిరమైన స్థానాన్ని మరింత బలపరిచే పరిణామంగా మారవచ్చు.

Tags:    

Similar News