గబ్బర్ సింగ్ దెబ్బకి లొకేషన్ మారింది

Update: 2017-02-23 08:12 GMT
కాటమరాయుడు.. గబ్బర్ సింగ్.. ఈ రెండు కంప్లీట్ డిఫరెంట్ సినిమాలు కదా. గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ ఓ పోలీస్.. ఇప్పుడు రాబోతోన్న కాటమరాయుడిలో ఫ్యాక్షనిస్ట్. అక్కడ ఫ్యాక్షనిజం అని చూపించకపోయినా.. విలన్ భరతం పట్టేస్తాడు.. ఇందులో తనే ఫ్యాక్షనిజం చూపించబోతున్నాడు. మరి ఈ రెండు సినిమాలకు లింక్ ఏంటా అనుకుంటున్నారా?

కాటమరాయుడు కోసం ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. శృతి హాసన్ తో ఓ మాంచి ఫోక్ సాంగ్ షూటింగ్ లో ఉన్నాడు. నిజానికి మొదట ఈ పాటను స్విట్జర్లాండ్ లో చిత్రీకరిద్దారమని భావించారట దర్శక నిర్మాతలు. అయితే.. గబ్బర్ సింగ్ మూవీలో 'పిల్లా నువ్వు లేని జీవితం' పాట ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనే విషయం తెలిసిందే. కానీ ఆ పాటను ఫారిన్ అందాల్లో కాకుండా.. ఇక్కడే ఆ పాట థీమ్ కు తగినట్లుగా ఫోక్ లుక్కులో సెట్ వేసి తీయాల్సిందనే మాట వినిపించింది. ఇప్పుడు కాటమరాయుడులో పాట ఫోక్ జోనర్ లోది కావడంతో.. ముందుగా అనుకున్న ప్రకారం కాకుండా.. పవన్ ఆఖరి నిమిషంలో ఇలా హైద్రాబాద్ షూటింగ్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది.

సినిమాల విషయంలో పవన్ బోలెడన్ని ఇన్ పుట్స్ ఇస్తుంటాడు. అందులో భాగమే ఇది కూడా. ఇక ఈ నెలాఖరుతో షూటింగ్ పూర్తి చేసుకోనున్న కాటమరాయుడు.. వచ్చే నెల 28న కాకుండా.. 24నే థియేటర్లలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News