ఆందోళ‌న‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్‌

Update: 2021-12-21 08:40 GMT
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే థియేట‌ర్ల ముందు ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. దాదాపు మూడేళ్ల విరామం త‌రువాత ప‌వ‌న్ `వ‌కీల్ సాబ్‌` చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. ఈ సినిమా రిలీజ్ స‌మ‌యంలో కానీ , ట్రైల‌ర్ థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన స‌మ‌యంలో కానీ ఫ్యాన్స్ చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. థియేట‌ర్ల గ్లాస్ డోర్లు ప‌గిలిపోయి నానా హంగామా జ‌రిగింది. ఆ క్రేజ్‌ని తట్టుకోవ‌డం.. ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్లా కాలేదు.

అయితే ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌మాద గంటిక‌లు మోగించింది.దీంతో ఫ్యాన్స్ ఒక్క‌సారిగా ఆందోళ‌న‌కు గుర‌య్యారు. మూడేళ్ల విరామం త‌రువాత వ‌చ్చిన బాస్ సినిమా సెకండ్ వేవ్ దెబ్బ‌తో ఎక్క‌డ ఆగిపోతుందోన‌ని భ‌యంతో వ‌ణికిపోయారు. అయితే తాజాగా అలాంటి భ‌య‌మే ఇప్పుడు ప‌వ‌న్ అభిమానుల్ని వెంటాడుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ .. రానాతో కలిసి న‌టించిన మాసీవ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `భీమ్లా నాయ‌క్‌`.

ఇప్న‌టికే త‌మ‌న్ అందించిన పాట‌లు రికార్డులు సృష్టిస్తుండ‌టంతో సినిమాపై భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో ఇదే అద‌నుగా భావించిన మేక‌ర్స్ సినిమాని సంక్రాంతి బ‌రిలో దించేస్తున్నామంటూ ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 12న సిమాని విడుద‌ల చేస్తున్నామ‌ని అధికారికంగా వెల్డించారు కూడా. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో `RRR`, `రాధేశ్యామ్‌` వంటి పాన్ ఇండియా మూవీస్ సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌డంతో వాటికి అండ‌గా నిల‌వాల‌న్న ఉద్దేశంతో `భీమ్లా నాయ‌క్‌`ని సంక్రాంతి రేస్ నుంచి మేక‌ర్స్ త‌ప్పించేలా ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ ప్ర‌య‌త్నాలు చేసి చివ‌రికి స‌ఫ‌ల‌మైంది.

దీంతో `భీమ్లా నాయ‌క్‌` సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింది. అయితే ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 25న రిలీజ్ చేస్తున్నామ‌ని, ఆ సినిమాకి ఆ డేట్ ని ఫైన‌ల్ చేశామ‌రి మంగ‌ళ‌వారం దిల్ రాజు స్ప‌ష్టం చేశారు. ఇదే ప‌వ‌న్ అభిమానుల్ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంది. ఫిబ్ర‌వ‌రిలో ఒమిక్రాన్ మ‌హ‌మ్మారి విజృంభించే ప్ర‌మాదం వుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రిక‌లు చేస్తున్న వేళ `భీమ్లా నాయ‌క్‌` ని ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల చేస్తున్నామని ప్ర‌క‌టించ‌డం మ‌ళ్లీ ఈ ద‌ఫా ఏమౌతుందోన‌ని ప‌వ‌న్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. మ‌ళ్లీ `వ‌కీల్ సాబ్` ప‌రిస్థితులు ఎదురైతే `భీమ్లా నాయ‌క్‌` ప‌రిస్థితి ఏంట‌ని వాపోతున్నారు.


Tags:    

Similar News