తల్లి, మూడో భార్య మధ్యలో రూ.30,000 కోట్లు.. కోర్టులో కీలక పరిణామం!

ఇదే సమయంలో... ఇరు పక్షాల న్యాయవాదులు కలిసి కూర్చుని అందరి ప్రయోజనం కోసం పరిష్కరించుకోవచ్చని తెలిపిన కోర్టు.. సగం సత్యాలు, సగం అసత్యాలు ఉన్నాయనే విషయం మనకందరికీ తెలుసని తెలిపింది.;

Update: 2026-02-10 12:47 GMT

గత ఏడాది జూన్ లో వ్యాపారవేత్త సంజయ్ కపూర్ మరణం తర్వాత రూ.30,000 కోట్ల సంపదపై నియంత్రణ కోసం కపూర్ ఫ్యామిలీలో వివాదాలు చెలరేగడం.. అవికాస్తా కోర్టు మెట్లెక్కడం తెలిసిందే. ఇందులో భాగంగా... ఆ సంపదపై నియంత్రణ కోసం ఆయన తల్లి రాణి కపూర్ ఢిల్లీ హైకోర్టులో దావా వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్పందించిన జస్టిస్ మినీ పుష్కర్ణ విచారం వ్యక్తం చేస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ (రాణి కపూర్ ఫ్యామిలీ ట్రస్ట్) కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలపై రాణి కపూర్ దాఖలు చేసిన సివిల్ దావాను ఈ రోజు ఢిల్లీ హైకోర్టు విచారించింది. గత ఏడాది తన కుమారుడు మరణంతో దుఃఖిస్తున్న సమయంలో పత్రాలపై సంతకాలు చేయాలని తనను బలవంతం చేశారని.. ఈ నేపథ్యంలో సదరు ట్రస్టును చెల్లనిదిగా, మోసపూరితమైనదిగా ప్రకటించాలని ఆమె తన దావాలో పేర్కొన్నారు!

ఈ వివాదం తొలుత సంజయ్ కపూర్ తల్లి రాణి కపూర్, ఆయన మూడో మూడో భార్య ప్రియా కపూర్ మధ్య మొదలవ్వగా... అతని రెండో భార్య కరిష్మా కపూర్ పిల్లలు తమ దివంగత తండ్రి రూ.30,000 కోట్ల ఆస్తులపై వాటా కోరిన తర్వాత ఈ వివాదం మరింత తీవ్రమైందని అంటున్నారు! ఈ నేపథ్యంలోనే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మినీ పుష్కర్ణ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... దేవుడు ఆ కుటుంబానికి గణనీయమైన సంపదను అనుగ్రహించాడని.. దానిని అందరూ అనుభవించాలని.. రాణి కపూర్ తో పాటు ప్రియ కపూర్, నటి కరిష్మా కపూర్, ఆమె ఇద్దరు పిల్లలైన.. కుమారుడు కియాన్, కుమార్తె సమైరాతో సహా ఇతర కుటుంబ సభ్యులు సామరస్యపూర్వకంగా ఈ వారసత్వ వివదాన్ని పరిష్కరించుకోవాలని.. అదే అందరికీ మంచిదని వ్యాఖ్యానించారు!

ఇదే సమయంలో... ఇరు పక్షాల న్యాయవాదులు కలిసి కూర్చుని అందరి ప్రయోజనం కోసం పరిష్కరించుకోవచ్చని తెలిపిన కోర్టు.. సగం సత్యాలు, సగం అసత్యాలు ఉన్నాయనే విషయం మనకందరికీ తెలుసని తెలిపింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగించడం వల్ల కుటుంబానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పిన జస్టిస్ పుష్కర్ణ.. పార్టీలు మరింత నిర్ణాయాత్మక విధానాన్ని అనుసరించాలని.. ఇది అంతిమంగా మీ మంచి కోసమే అని అన్నారు!

కాగా.. 53 ఏళ్ల సంజయ్ కపూర్ గత ఏడాది జూన్ 12న లండన్ లో పోలో ఆడుతూ మరణించిన సంగతి తెలిసిందే. తొలుత ఆయన మరణానికి గుండెపోటు కారణమని చెప్పగా.. అనంతరం ఒక తేనెటీగ అతని నోటిలోకి ఎగిరిన తర్వాత అతనికి అనాఫిలాక్టిక్ షాక్ వచ్చిందనీ పలు నివేదికలు వెల్లడించాయి!

Tags:    

Similar News