కపుల్ ఫ్రెండ్లీకి ప్రభాస్ బూస్ట్.. సంతోష్ శోభన్ ఏమన్నారంటే?

ఆ తర్వాత ప్రభాస్ సపోర్ట్ పై మాట్లాడారు సంతోష్ శోభన్. మనం అడగకముందే ఆయన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్‌ ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేశారని చెప్పారు.;

Update: 2026-02-10 12:46 GMT

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. యూవీ కాన్సెప్ట్స్ నిర్మాణంలో, యూవీ క్రియేషన్స్ సమర్పణలో రూపొందిన ఆ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని సినిమాను విడుదల చేస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ హైదరాబాద్‌ లో ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సమయంలో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. సినిమాకు అందరి నుంచి మంచి స్పందన వస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నుంచి కూడా సూపర్ సపోర్ట్ లభిస్తోందని చెప్పారు.

ఇటీవల చేసిన ప్రమోషన్ టూర్‌ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, చాలా మంది తనకు సక్సెస్ అందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆ ప్రేమ చూస్తే ఎంతో హ్యాపీగా ఉందని అన్నారు. ధీరజ్ మొగిలినేని తమ టీమ్‌ లో చేరిన తర్వాత తమకు మరింత బలం వచ్చినట్లు సంతోష్ తెలిపారు. తన లాగే నిర్మాత అజయ్ అన్న, దర్శకుడు అశ్విన్, ధీరజ్ గారు సినిమాను చాలా ప్యాషన్‌ తో చేస్తున్నారని చెప్పారు.

ఆ తర్వాత ప్రభాస్ సపోర్ట్ పై మాట్లాడారు సంతోష్ శోభన్. మనం అడగకముందే ఆయన కపుల్ ఫ్రెండ్లీ మూవీ ట్రైలర్‌ ను ఇన్‌ స్టాగ్రామ్‌ లో షేర్ చేశారని చెప్పారు. అది తమకు ఎంతో పెద్ద సపోర్ట్ అని, ఆయన చూపిన ప్రేమ మర్చిపోలేమని అన్నారు. అయితే రీసెంట్ గా కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ ను పోస్ట్ చేసిన డార్లింగ్.. సినిమాపై ప్రశంసలు కురిపించడం విశేషం.

కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ మనసులో నుంచి నేరుగా చెప్పిన ప్రేమ కథలా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. సంతోష్ శోభన్, అజయ్ రాజు సహా టీమ్ అందరికీ బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ట్రైలర్ పై ప్రభాస్ ప్రశంసలు కురిపించడంతో.. సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రభాస్ లాంటి స్టార్ హీరో నుంచి ప్రశంస రావడం మూవీ టీమ్‌ కు పెద్ద బూస్ట్‌ గా మారిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ఇక కపుల్ ఫ్రెండ్లీ ట్రైలర్ విషయానికొస్తే.. లవ్, ఫ్రెండ్ షిప్, కమిట్మెంట్, పెళ్లి వంటి అంశాలను టచ్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే కథలో కామెడీ ట్రాక్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారేలా కనిపిస్తుంది. రిలేషన్‌ షిప్ తర్వాత పెళ్లి నిర్ణయం తీసుకున్న జంటకు ఎదురయ్యే సమస్యలు ఏంటి? అసలు వీరి ప్రయాణంలో ఏం జరుగుతుంది? అన్నది సినిమాగా టాక్. మరి ఇంకొన్ని రోజుల్లో రానున్న కపుల్ ఫ్రెండ్లీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News