నిజంగానే సర్ ప్రైజ్ ఇచ్చాడు..

Update: 2015-09-01 15:41 GMT

Full View
నిఖిల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శంకరాభరణం టీం ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేసిందని చెప్పాడు. చెప్పినట్టే నిజంగా ఆశ్చర్యపరిచాడు. సాధారణంగా సినిమా వాళ్ళు తమ సినిమాకి సంబంధించిన పాటనో, టీజర్ నో విడుదల చేస్తారు. వాటన్నిటికీ భిన్నంగా ఈ సినిమా బృందం పవర్ స్టార్ మీద ఓ పాట రాసి, దానికి పవన్ స్టిల్స్ కొన్ని అతికించి ఒక వీడియో ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. నిజంగా ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తుందిప్పుడు. అయితే ఈ లిరిక్స్ రాసింది.. సంగీతం సమకూర్చింది.. ఎడిట్ చేసింది ఎవరన్నది స్పెసిఫిక్ గా చెప్పలేదు. చెప్పకపోయినా దీనివెనక అసలు కారణం కోనాజీ అన్నది స్పష్టం. రచయిత కనుక ఆ నాలుగు లైన్ లు ఆయనే రాసుండొచ్చు. ఆ నాలుగు లైన్ లలోనే ఒక అభిమాని పవన్ గురించి ఎలా భావిస్తాడో, ప్రేమిస్తాడో చెప్పారు. లిరిక్స్ ని ఓసారి మననం చేసుకోండి మీకే తెలుస్తుంది.

ఎవరైతే అడుగేస్తే చైతన్య రథాలు జాగే ఛలో తెలుగింటి గుండెల నిండా ఆ ప్రేమ తుఫాను కమ్మేసెనో  దిక్కుల్ని చుక్కల్ని జయించి వస్తే.. మమ్మల్ని నీ మాయతో పడేస్తే నీ మాయ సుఖాల సంకెళ్ళు వేస్తే.. శాసించే నీరాజనం పవనిజమే జగతిమతం.. మా పవరుకిదే జన్మదినం

ఇదిలా వుంటే.. పవన్ కళ్యాణ్ 'సర్దార్ గబ్బర్ సింగ్' టీజర్ కూడా అర్దరాత్రి సందడి చేయనుంది. ఆలోపు ఫాన్స్ కోసం ఓ బర్త్ డే పోస్టర్ ని విడుదల చేశారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ టీజర్ కి అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడని దర్శకుడు బాబీ చెబుతున్నాడు. మెగా పవర్ స్టార్ కూడా బాబాయ్ కి కొత్త టీజర్ తో విష్ చేస్తాడని దర్శకుడు శ్రీనువైట్ల చెప్పాడు. కానుకలన్నీ మెగాస్టార్ కే అనుకున్నా... పవర్ స్టార్ కి సరికొత్త కానుకలు ఇవ్వడంతో మెగా-పవర్ అభిమానులందరూ హ్యాపీ..!

Tags:    

Similar News