పవన్ లాజిక్కే.. బన్నీకి కూడా వర్తిస్తుంది
ఒకానొక టైములో ''పంజా'' సినిమా ఆడియో లాంచ్ లో మాట్లాడుతూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే.. ''చిరంజీవి తమ్ముడిగా ఇండస్ర్టీలోకి అడుగుపెట్టినా కూడా.. తొలిప్రేమ సినిమా తరువాత నుండి సొంతంగా నేను క్రియేట్ చేసుకున్న స్టయిల్ తోనే బ్రేక్ వచ్చింది'' అని చెప్పాడు. అంటే దానర్ధం.. ప్రతీసారి 'అన్నయ్య అన్నయ్య' అంటూ భజన చేయక్కర్లేదు అనేగా ఇన్ డైరెక్టుగా చెప్పడం?
అలాంటప్పుడు అల్లు అర్జున్ కు కూడా సేమ్ లాజిక్ ఎప్లయ్ అవుతుంది కదా. కాదంటారా? మెగాస్టార్ లింక్ తో తొలి సినిమా ఛాన్సొచ్చింది నిజమే. కాని ఆ తరువాత ఆర్య వంటి సినిమాలో ఆ డ్యాన్సులను వేయడం.. తదుపరి రోజుల్లో స్టయిలిష్ స్టార్ గా పేరు తెచ్చుకోవడం.. ఇవన్నీ అతని హార్డ్ వర్క్ నుండి క్రియేట్ చేసుకున్న సక్సెస్ ఫ్యాక్టర్లేగా. అలాంటప్పుడు నిజానికి మెగాస్టార్ భజనే మనోడు చేయక్కర్లేదు. ఇక పవర్ స్టార్ భజన ఎందుకు? ఇప్పుడు అల్లు అర్జున్ ది తప్పంటే.. అప్పుడు పవన్ కళ్యాణ్ ది కూడా తప్పేగా మరి? అప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది కరక్ట్ కాబట్టి.. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా కరక్టేగా. లాజిక్.
అయితే.. చిరంజీవి యాక్టర్ కాక మునుపే.. దివంగత శ్రీ అల్లు రామలింగయ్య ఒక గొప్ప నటుడు. ఎన్టీఆర్ వంటి పెద్ద పెద్ద హేమాహేమీలే ఆయన్ను తమ సినిమాల్లో పెట్టుకోవాలని ఆయన డేట్ల కోసం వెయిట్ చేసేవారు. ఆయన అల్లుడిగా అయిన తరువాతనే.. చిరంజీవికి బ్రేక్ వచ్చింది అంటారు. అలా చూస్తే.. టోటల్ మెగా ఫ్యామిలీ అల్లు వారి జపం చేయాలేమో. అంతేకాదు.. ఇటు చిరంజీవి ఫ్యామిలీకంటే అటు అల్లు తాత గారి ద్వారా వచ్చిన యాక్టింగ్ జీన్స్ బన్నీలో ఎక్కువగా ఉంటాయ్ మరి. సర్లేండి.. రాసుకుంటూ పోతే రప్చర్ అయిపోతుంది!!