వెండితెర మీద రాజమౌళి ముద్ర రుచి చూశారా..?
దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా దానికో భారీ సెటప్ ఎరేంజ్ చేస్తాడు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్నాయి.;
దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా దానికో భారీ సెటప్ ఎరేంజ్ చేస్తాడు. ముఖ్యంగా బాహుబలి తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటున్నాయి. ఆఫ్టర్ బాహుబలి RRR తో ఏకంగా ఆస్కార్ ని టచ్ చేశాడు జక్కన్న. ఇక నెక్స్ట్ రాబోతున్న వారణాసి సినిమాతో చాలా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని అనిపిస్తుంది. రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా ఎలా ఉండాలని ఫ్యాన్స్ అనుకుంటారో ఆ అంచనాలను మించి ఈ సినిమా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న.
రాజమౌళి. సినిమా ఎలా ప్రమోట్ చేయాలి..
వారణాసి గ్లింప్స్ తోనే సినిమాపై ఒక హ్యూజ్ బజ్ పెంచేశాడు రాజమౌళి. సినిమా తీయడమే కాదు దాన్ని ఎలా ప్రమోట్ చేయాలి అన్న దానిలో పి.హెచ్ డి చేశాడు రాజమౌళి అందుకే వారణాసి గ్లింప్స్ ని సినిమాల రిలీజ్ టైం లో ఫీస్ట్ గా అందిస్తున్నాడు. లేటెస్ట్ గా రిలీజైన బాలకృష్ణ అఖండ 2 థియేటర్ లో వారణాసి గ్లింప్స్ సర్ ప్రైజ్ చేసింది. వారణాసి గ్లింప్స్ ని వెండితెర మీద చూసిన ఆడియన్స్ అదరహో అనేస్తున్నారు.
రాజమౌళి ఫ్రేమ్ అంటే డీటైలింగ్ లో నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటుంది. అలా వారణాసి గ్లింప్స్ లో ప్రతి ఫ్రేం ని 70 MM స్క్రీన్ మీద ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు ఆ విజువల్ క్వాలిటీ.. మ్యూజిక్.. టేకింగ్.. ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్ అన్నీ కూడా జస్ట్ టీజర్ తోనే పూనకాలు తెప్పించేస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ తో ఒకటి రెండు కాదు ఐదు డిఫరెంట్ రోల్స్ చేయిస్తున్నాడని టాక్.
అఖండ 2లో మహేష్ వారణాసి గ్లింప్స్..
అదే నిజమైతే మాత్రం రాజమౌళి సినిమాలో సూపర్ స్టార్ మహేష్ విశ్వరూపంగా ఇంతకుముందు ఉన్న సినిమాల రికార్డులన్నీ కూడా చెరిపేయడం పక్కా అని చెప్పొచ్చు. అఖండ 2లో మహేష్ వారణాసి గ్లింప్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. అంతేకాదు సినిమాను ఐమాక్స్ స్క్రీన్ పై చూసిన ఆడియన్స్ కి ఈ టీజర్ ఫుల్ స్క్రీన్ ట్రీట్ ఇవ్వడం మరింత స్పెషల్ గా మారింది. సో తప్పకుండా రాజమౌళి వారణాసి రిలీజ్ లోపు ఏ భారీ సినిమా రిలీజైన దాన్ని తన సినిమా ప్రమోషన్స్ కి వాడుకుంటాడని చెప్పడంలో సందేహం లేదు.
వారణాసి సినిమా లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా కుంభ రోల్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఈ సినిమాను హాలీవుడ్ మూవీస్ కి ధీటుగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్న జక్కన్న 2027 సమ్మర్ కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. వారణాసి నుంచి సంచారి సాంగ్ తో కీరవాణి మరోసారి అదరగొట్టగా కుంభ నేపథ్యంతో వచ్చే ప్రళయం సాంగ్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.