వీకెండ్స్ లో ఓటీటీలో అలరిస్తున్న చిత్రాలు, వెబ్ సిరీస్ లు ఇవే.. ఆ 2 మాత్రం డోంట్ మిస్!

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకొని ఓటీటీ స్ట్రీమింగ్ కి కొన్ని చిత్రాలు అలాగే వెబ్ సిరీస్ లు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-12 06:39 GMT

ఎప్పటిలాగే ఈ వారం కూడా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకొని ఓటీటీ స్ట్రీమింగ్ కి కొన్ని చిత్రాలు అలాగే వెబ్ సిరీస్ లు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వీకెండ్స్ లో కూడా ప్రేక్షకులను అలరించడానికి ప్రత్యేకించి కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు సిద్ధమవుతున్నాయి. పైగా రెండవ శనివారం అటు ఆదివారం రెండు రోజులు సెలవు దినాలు కావడంతో ఈ రెండు రోజులను ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడానికి.. మంచి కథ ఓరియంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. మరి ఈ వీకెండ్స్ లో ఆడియన్స్ ను చిల్ చేయడానికి వస్తున్న చిత్రాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆహా:

3 రోజెస్ సీజన్ 2:

ప్రముఖ గ్లామర్ బ్యూటీస్ అయినా రాశీ సింగ్, ఖుషిత, ఈషా రెబ్బ ప్రధాన పాత్రలో రూపొందిన సిరీస్ 3 రోజెస్ సీజన్ 2. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. యువతను ఆకట్టుకునే అంశాల మేలవింపుతో రాబోతున్న ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 13 నుండి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి విడుదల చేసిన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక ఇందులో హర్ష, సత్య మరో కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నెట్ ఫ్లిక్స్:

1.కాంత:

ప్రముఖ నటుడు , నిర్మాత అయిన దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన చిత్రం కాంత. నవంబర్ 14న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించడానికి సిద్ధమయ్యింది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే , సముద్రఖని, రానా దగ్గుపాటి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది.

2. మ్యాన్ వర్సెస్ బేబీ (వెబ్ సిరీస్ - ఇంగ్లీష్)

3. గుడ్ బై జూన్ ( సినిమా - ఇంగ్లీష్)

4. వేక్ అప్ డెడ్ మ్యాన్ ( మూవీ - ఇంగ్లీష్)

5. సింగిల్ పాపా (వెబ్ సిరీస్)

అమెజాన్ ప్రైమ్ వీడియో:

1.మెర్వ్ (మూవీ -ఇంగ్లీష్)

2.40 ఏకర్స్ ( మూవీ - ఇంగ్లీష్)

3.టెల్ మీ సాఫ్టీ (మూవీ - ఇంగ్లీష్)

జియో హాట్ స్టార్:

1.ఆరోమాలే (మూవీ - తెలుగు, తమిళ్)

2.ది గ్రేట్ షంషుద్దీన్ ఫ్యామిలీ (మూవీ - తెలుగు)

3.సూపర్ మ్యాన్ (ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ)

జీ 5:

1.సాలీ మొహబ్బత్ ( మూవీ -హిందీ)

2.కేసరియా (డాక్యుమెంటరీ సిరీస్ హిందీ)

సన్ నెక్స్ట్ :

1.తీవర్ కులాయ్ నదుంగ (మూవీ - తమిళ్)

ఈటీవీ విన్:

కలివి వనం:

తెలంగాణ జానపదాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హీరోయిన్ నాగదుర్గ కీలక పాత్ర పోషించిన చిత్రమిది. తెలుగు ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది. రఘు బాబు, బిత్తిరి సత్తి, సమ్మేట గాంధీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ప్రకృతి గొప్పతనాన్ని చాటి చెప్పేలా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రంతో పాటు కాంత సినిమాల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News