బిగ్ బాస్ 9.. సుమన్, డీమాన్ అవుట్ ఆఫ్ ది గేమ్..!
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఇమ్యూనిటీ పొంది ఫైనల్ వీక్ కి వెళ్లేందుకు హౌస్ మేట్స్ కి టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఇమ్యూనిటీ పొంది ఫైనల్ వీక్ కి వెళ్లేందుకు హౌస్ మేట్స్ కి టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. లీడర్ బోర్డ్ లో పాయింట్స్ తో పాటు టాస్క్ లతో వచ్చే కౌంట్ తో ఈ గేమ్ కొనసాగుతుంది. ఐతే గురువారం ఎపిసోడ్ లో సుమన్ శెట్టి లీడర్ బోర్డ్ లో లీస్ట్ స్కోరర్ గా ఉన్న కారణంగా అతన్ని ఆట నుంచి తొలగించారు. అంటే ఈ వారం అతను హౌస్ నుంచి సేఫ్ అయ్యే ఛాన్స్ లేదు.
బిగ్ బాస్ జోకర్ టాస్క్ లో సంజనాకి 4 పాయింట్స్..
ఐతే సుమన్ ఇప్పటివరకు సంపాదించిన స్కోర్ లో సగం పాయింట్స్ తో పాటుగా లక్ష పాయింట్స్ లో సగం కూడా వేరొకరికి ఇవ్వాలని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. ఐతే ముందు అతను భరణికి ఇవ్వాలని అనుకోగా టాప్ స్కోర్ లో ఉంటే అందరు తనని టార్గెట్ చేస్తారని భరణి తనకన్నా సంజనాకి ఆ స్కోర్ ఇవ్వమని అంటాడు. అలా సంజనాకి సుమన్ స్కోర్ ఇవ్వడంతో ఆమె టాప్ 2కి వెళ్తుంది.
ఇక నెక్స్ట్ టాస్క్ లో అందరు కలిసి భరణిని ఆట నుంచి తొలగిస్తారు. బిగ్ బాస్ ఇచ్చిన జోకర్ టాస్క్ లో సంజనాకి 4 పాయింట్స్, ఇమ్మాన్యుయెల్ కి 4 పాయింట్స్ రాగా తనూజ, డీమాన్ పవన్ లకు జీరో పాయింట్స్ వస్తాయి. ఐతే ఈ టాస్క్ తర్వాత డీమాన్ పవన్ లీస్ట్ స్కోర్ గా ఉన్నాడు. అతన్ని కూడా బిగ్ బాస్ ఆట నుంచి తప్పించగా అతని స్కోర్ లో సగం తనూజకి ఇచ్చాడు. అలా తనూజ లీడర్ బోర్డ్ లో టాప్ స్కోరర్ గా ఉంది.
సుమన్ శెట్టి ఇమ్యూనిటీ పొందలేదు..
ఐతే ఈ వారం లీస్ట్ గా ఉన్న వారిలో నుంచి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా ఇద్దరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది. ఆల్రెడీ సుమన్, డీమాన్ పవన్ ఆట నుంచి తప్పుకున్నారు. ఐతే డీమాన్ కి ఆడియన్స్ ఓటింగ్ బాగానే ఉంది. సుమన్ శెట్టి ఈ వారం ఇమ్యూనిటీ పొందలేదు కాబట్టి అతని ఎలిమినేషన్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. ఐతే టాప్ 5 ఉండాలి కాబట్టి మరో ఎలిమినేషన్ అంటే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. ఆ రెండో ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్ ఎవరన్నది క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సీజన్ ఫైనల్ విన్నర్ గురించి కూడా వార్ వన్ సైడ్ అయితే అయ్యేలా లేదు. టాప్ 3 లో ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్, తనూజ ముగ్గురు కూడా చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు. ఆడియన్స్ కూడా ముగ్గురికి సమానమైన ఓటింగ్ పర్సెంటేజ్ తో వెళ్తున్నారు. ఐతే ఫైనల్ గా విన్నర్ ని ఎవరు చేస్తారన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.