బిగ్ బాస్ 9.. తనూజకి మరో ఛాన్స్..!
ఈ సీజన్ లో మొదటి నుంచి తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్న ఆమె ఫైనల్ వీక్ కి ముందు వారం లీడర్ బోర్డ్ టాస్క్ లో కూడా తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో మరోసారి లీడర్ బోర్డ్ లో టాప్ లో దూసుకెళ్తుంది తనూజ. ఈ సీజన్ లో మొదటి నుంచి తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తున్న ఆమె ఫైనల్ వీక్ కి ముందు వారం లీడర్ బోర్డ్ టాస్క్ లో కూడా తన ఆట తీరుతో ఆకట్టుకుంటూ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ ఆల్రెడీ ఈ వారం లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉండి ఆడియన్స్ కి ఓటింగ్ అప్పీల్ చేసే ఛాన్స్ అందుకోగా గురువారం ఫైనల్ గా లీడర్ బోర్డ్ లో టాప్ లో ఉండి మరోసారి ఓట్ అప్పీల్ ఛాన్స్ అందుకుంది.
ఈ వారం రెండోసారి ఛాన్స్..
సంజనా, తనూజ ఇద్దరికి ఆ ఛాన్స్ రాగా అందులో ఆడియన్స్ సంజనాకి కాకుండా తనూజాకే ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చారు. ఆల్రెడీ ఆమె ఒకసారి ఓట్ అప్పీల్ చేసింది. ఈ వారం రెండోసారి ఆ ఛాన్స్ వచ్చింది. సో దీని వల్ల తనూజని ఇష్టపడే ఆడియన్స్ కి మరింత రీచ్ అయ్యేలా జరిగింది. తనూజ కూడా ఈ సీజన్ విన్నర్ అయ్యే ఛాన్స్ లేకపోలేదు. పోటీగా ఉన్న కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ కి ఈక్వల్ గా తన ఆట తీరుతో ఆడియన్స్ ని మెప్పించింది.
ఐతే ఫైనల్ గా ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారు అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 9లో లేడీ విన్నర్ అయితే చూడాలని ఆమె కోరుతుంది. అందుకే వచ్చిన ఆడియన్స్ కి కూడా అదే తన రిక్వెస్ట్ గా చెబుతుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ లో బిందు మాధవి విన్నర్ అయ్యింది. ఐతే ఈసారి సీజన్ 9 టైటిల్ విజేతగా తనూజ నిలుస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
టికెట్ టు ఫినాలే టాస్క్..
టాప్ 3లో ఉన్న కళ్యాణ్, తనూజ, ఇమ్మాన్యుయెల్ ముగ్గురికి సమాన అవకాశాలు ఉన్నాయి. ఐతే ఇమ్మాన్యుయెల్, తనూజ సెలబ్రిటీస్ కాగా కళ్యాణ్ కామనర్ గా వచ్చి టాప్ 3లో ఉన్నాడు. అంతేకాదు ప్రతి టాస్క్ లో అతను తన ఎఫర్ట్స్ తో మెప్పిస్తూ వచ్చాడు. ఈ సీజన్ చివరి కెప్టెన్ అవ్వడమే కాకుండా టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్. సో ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ని దాటి తనూజ దాకా టైటిల్ వస్తుందా లేదా అన్నది ఆమెకు పడే ఓటింగ్ బట్టి డిసైడ్ అవుతుంది.
బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ముగ్గురికి విన్నింగ్స్ ఛాన్స్ లు ఉన్నాయి. ప్రతి సీజన్ లో కేవలం ఇద్దరి మధ్య టఫ్ ఫైట్ ఉంటుంది. మూడో వ్యక్తికి ఛాన్స్ ఉండేది కాదు కానీ ఈసారి మాత్రం టాప్ 3 ముగ్గురికి ఆ అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఐతే మెజారిటీ పీపుల్ ఎవరికి ఓట్ వేస్తారో వారే టైటిల్ విజేతగా నిలిచే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ వీకెండ్ విన్నర్ డిసైడ్ అవుతుంది కాబట్టి ఫైనల్ ఎపిసోడ్ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది.