భరణి, సంజనా ఇద్దరిలో ఎవరికి ఆ అర్హత ఉంది..?
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఫైనల్ వీక్ కి ఇమ్యూనిటీ పొందేందుకు లీడర్ బోర్డ్ పాయింట్స్ టాస్క్ నడుస్తుంది.;
బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం ఫైనల్ వీక్ కి ఇమ్యూనిటీ పొందేందుకు లీడర్ బోర్డ్ పాయింట్స్ టాస్క్ నడుస్తుంది. ఐతే ఈ టాస్క్ లో ఆల్రెడీ సుమన్, డీమాన్ పవన్ లీస్ట్ పాయింట్స్ తో అవుట్ ఆఫ్ ది టాస్క్ కాగా ఈరోజు ఎపిసోడ్ లో భరణి లీస్ట్ పాయింట్స్ రావడంతో అతను కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యాడు. ఐతే తన పాయింట్స్ షేర్ చేయాల్సి ఉండగా అది సంజనాకి ఇస్తాడనుకోగా తనూజ పేరు చెప్పి షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ సీజన్ 9లో తనూజ, భరణి ఇద్దరు మంచి బాండింగ్ కలిగి ఉన్నారు. భరణిని నాన్న నాన్న అంటూ తనూజ ఎంతో అభిమానించింది. ఐతే మధ్యలో దివ్య రావడం వల్ల భరణి కాస్త దూరమయ్యాడు.
భరణి కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్..
ఇదిలా ఉంటే ఈ వారం ఇమ్యూనిటీ టాస్క్ లో సుమ, డీమాన్ పవన్ టాస్క్ నుంచి బయటకు వెళ్లగా ఇప్పుడు భరణి కూడా అవుట్ ఆఫ్ ది టాస్క్ అయ్యాడు. ఐతే ఈ టైం లో టాప్ 5కి ఎవరెవరు అర్హత సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఆల్రెడీ కళ్యాణ్ టికెట్ టు ఫినాలే గెలిచి ఫైనల్ వీక్ కి వెళ్లాడు. నెక్స్ట్ తనూజ, ఇమ్మాన్యుయెల్ కూడా టాప్ 3లో ఉంటారు. డీమాన్ పవన్ కూడా టాప్ 5 పక్కా ఉండే ఛాన్స్ ఉంది.
ఇక ఐదో కంటెస్టెంట్ ఎవరన్నది ఆడియన్స్ చేతుల్లో ఉంది. భరణి, సంజనా ఈ ఇద్దరిలో ఒకరు టాప్ 5కి వెళ్తే ఒకరు ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి ఎగ్జిట్ అవుతారు. సుమన్ తో పాటు ఈ వారం రెండో ఎలిమినేషన్ కూడా ఉంటుందని టాక్. ఆ ఎలిమినేషన్ ఉంటుందా లేదా భరణి, సంజనా ఇద్దరినీ టాప్ 5 కాదు టాప్ 6 అని వాళ్లకి కూడా ఫైనల్ వీక్ ఛాన్స్ ఇస్తారా అన్నది చూడాలి. ఐతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరణి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యి ఒకసారి బయటకి వెళ్లొచ్చాడు కాబట్టి సంజనా మొదటి వారం నుంచి హౌస్ లో కొనసాగుతుంది అనే రీజన్ తో ఆమెను టాప్ 5కి ప్రమోట్ చేయాలని అంటున్నారు.
మెజారిటీ ఓటింగ్ ని బట్టి ఛాన్స్..
భరణి కూడా రీ ఎంట్రీ ఇచ్చాక తన ఆటతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు తన ఫన్ సైడ్ తో కూడా ఆడియన్స్ ని మెప్పించాడు. తప్పకుండా భరణి కూడా టాప్ 5కి అర్హుడు అనే వాళ్లు ఉన్నారు. సో ఈ ఇద్దరిలో ఎవరికి ఆ ఛాన్స్ ఇస్తారన్నది మెజారిటీ ఓటింగ్ ని బట్టి ఉంటుంది. ఐతే కొందరు న్యూట్రల్ ఆడియన్స్ ఇద్దరికి ఆ ఛాన్స్ వచ్చినా బెటర్ అనేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 9లో టాప్ 5 లేదా 6 దాదాపు కన్ ఫర్మ్ అయ్యారు. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే టాప్ 6 హౌస్ మేట్స్ ఫైనల్ వీక్ కి వెళ్తారని చెప్పొచ్చు.