• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మహేష్‌ మల్టీప్లెక్స్‌ లో...

మహేష్‌ మల్టీప్లెక్స్‌ లో పవన్‌ ఆల్‌ టైమ్‌ రికార్డ్‌

By - Tupaki Desk
Update: 2021-04-08 06:30 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మల్టీప్లెక్స్‌ ఏఎంబీలో పవన్‌ కళ్యాణ్‌ వకీల్‌ సాబ్‌ తో ఆల్‌ టైమ్‌ రికార్డును దక్కించుకున్నాడు. ఏఎంబీ లో మొత్తం 7 స్క్రీన్స్ ఉంటాయి. ఆ ఏడు స్క్రీన్స్‌ కలిపి వకీల్‌ సాబ్‌ మొదటి రోజు 27 షోలు పడబోతున్నాయి. ఏఎంబీలో మొత్తం 27 షోలకు గాను టికెట్లు బుక్‌ అయ్యాయి. అది కూడా విడుదలకు నాలుగు రోజుల ముందే కొన్ని గంటల వ్యవధిలోనే. వకీల్‌ సాబ్‌ సినిమా కు ఉన్న బజ్‌ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌ రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. బుకింగ్‌ ప్రారంభం అయిన కొద్ది గంటల్లోనే మొత్తం అన్ని ఏరియాల్లోని మొదటి రోజు షోలకు టికెట్లు బుక్‌ అయ్యాయి. ఏఎంబీ మల్టీప్లెక్స్‌ లో గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి రోజు 27 షో లకు హౌస్‌ ఫుల్‌ అవ్వడం రికార్డుగా చెబుతున్నారు.

ఏఎంబీ మల్టీ ప్లెక్స్‌ ప్రారంభం అయ్యి మూడు సంవత్సరాలు అయ్యింది. ఇన్నేళ్ల కాలంలో ఏ ఒక్క సినిమా కూడా మొదటి రోజు 27 షో లు హౌస్‌ ఫుల్‌ అవ్వలేదు. పవన్‌ కళ్యాణ్‌ సినిమాకు ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో ఏఎంబీలో మొత్తం అన్ని స్క్రీన్స్‌ లో సినిమాను స్క్రీనింగ్‌ చేస్తున్నారు. దాంతో ఒక్క రోజులోనే కేవలం ఏఎంబీలోనే ఏకంగా 27 షో లు వకీల్‌ సాబ్‌ పడబోతున్నాయి. ఈ ఓపెనింగ్స్‌ చూస్తుంటే రికార్డు బ్రేకింగ్‌ ఖాయంగా అనిపిస్తుంది. వకీల్‌ సాబ్‌ సినిమా కేవలం ఏఎంబీలో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని మల్టీ ప్లెక్స్‌ లో కూడా హౌస్‌ ఫుల్‌ కలెక్షన్స్‌ తో మొదటి రోజు ఆడబోతుంది. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ పూర్తి అయ్యాయి. శని, ఆదివారాల షోలకు కూడా 80 శాతంకు పైగా టికెట్లు ఆన్‌ లైన్‌ లో బుక్‌ అయ్యాయి.

వకీల్‌ సాబ్‌ సినిమా మొదటి మూడు రోజుల్లో ఏఎంబీ సినిమాలో రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వస్తే శని మరియు ఆదివారాల్లో కూడా రికార్డు స్థాయిలో షో లు పడే అవకాశం ఉంది. మొదటి మూడు రోజుల్లో దాదాపుగా 60 షో లు వేయడం వల్ల భారీ మొత్తంలో వసూళ్లను రాబట్టే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా ఏఎంబీలో వకీల్‌ సాబ్‌ సరికొత్త రికార్డులను దక్కించుకోబోతున్నాడు.
Tags:    
  • Pawan Kalyan 
  • all time record 
  • Mahesh Multiplex 
  • Amb Cinemas 
  • Tollywood 
  • Telugu News 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS