• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌.. హరీష్‌ శంకర్‌...

పవన్‌.. హరీష్‌ శంకర్‌ కూడా అదే స్పీడ్‌

By - Tupaki Desk
Update: 2021-06-03 08:30 GMT
పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ సినిమాలు చేయడేమో అనుకుంటున్న సమయంలో వరుసగా సినిమాలకు కమిట్ అయ్యాడు.. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్న నేపథ్యంలో టైమ్‌ ఎలా సరిపోతుందని కొందరు అనుమానం వ్యక్తం చేశారు. అయితే గతంలో మాదిరిగా ఒక్కో సినిమా ఏడాది పాటు కాకుండా కొన్ని వారాల వ్యవధిలోనే ముగించేయాలనేది పవన్‌ ప్లాన్‌ గా చెబుతున్నారు. ప్రతి సినిమా కూడా చాలా తక్కువ రోజులు షూటింగ్ తో ప్లాన్‌ చేస్తున్నారు.

ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన వకీల్‌ సాబ్ సినిమా కోసం పవన్‌ రెండు నెలలు కూడా కష్టపడింది లేదు. ఇక మలయాళ సూపర్ హిట్ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ కోసం కూడా పవన్‌ కేవలం 40 వర్కింగ్‌ డేస్ మాత్రమే ఇచ్చాడని సమాచారం. ఇక క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమాను కూడా తక్కువ డేట్లతోనే ముగించేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రిష్ 50 శాతం సినిమా షూటింగ్‌ ను ముగించాడు. మరో నెల రోజుల పాటు షూటింగ్ చేసి గుమ్మడి కాయ కొట్టబోతున్నాడు.

ప్రతి సినిమా కూడా రెండు నెలలు మూడు నెలల డేట్లతోనే పూర్తి చేస్తున్నాడు పవన్‌. ఇక హరీష్‌ శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా విషయంలోనూ పవన్‌ అదే స్పీడ్ ను మెయింటెన్‌ చేయబోతున్నాడు. ఈ గబ్బర్‌ సింగ్‌ కాంబో మూవీ కేవలం 60 రోజుల వర్కింగ్‌ డేస్‌ తో ముగించబోతున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే జులై లేదా ఆగస్టులో ప్రారంభించి ఏకథాటిగా సినిమా పూర్తి అయ్యే వరకు షూటింగ్‌ కొనసాగించబోతున్నారట.

ఈ ఏడాది అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. హరిహర వీరమల్లు సినిమాను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఇక హరీష్‌ మూవీని ఆ రెండు సినిమాల మద్యలో విడుదల చేసేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. కరోనా కనికరిస్తే అది సాధ్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
Tags:    
  • Power Star Pawan Kalyan 
  • Harish Shankar 
  • Tollywood 
  • Telugu News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS