• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్‌.. హరీష్‌ శంకర్‌...

పవన్‌.. హరీష్‌ శంకర్‌ మూవీ ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

By - Tupaki Desk
Update: 2021-04-23 10:30 GMT
పవన్ కళ్యాణ్‌ బ్యాక్‌ టు బ్యాక్ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నాడు. వకీల్ సాబ్ తో ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ మరో వైపు సాగర్ చంద్ర దర్శకత్వంలో మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ లో రానాతో కలిసి నటిస్తున్నాడు. అలాగే క్రిష్‌ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను కూడా చేస్తున్నాడు. కరోనా కారణంగా కాస్త ఆలస్యం అవుతున్న ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే హరీష్‌ శంకర్ దర్శకత్వంలో సినిమాను కూడా పవన్ సెట్స్ పైకి తీసుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌.. హరీష్‌ శంకర్ ల కాంబోలో వచ్చిన గబ్బర్‌ సింగ్‌ సెన్షేషన్‌ సక్సెస్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబో సెట్‌ అయ్యింది. ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త ఒకటి సినీ వర్గాల్లో మరియు మీడియా సర్కిల్‌ లో చర్చనీయాంశంగా మారింది.

గబ్బర్ సింగ్‌ తో పాటు పవన్‌ కళ్యాణ్‌ అంతకు ముందు నటించిన పలు సినిమాల్లో అలీ ముఖ్య పాత్రల్లో కనిపించాడు. కాని ఈమద్య కాలంలో పవన్ సినిమాల్లో ఆయన కనిపించడం లేదు. వకీల్ సాబ్‌ సినిమా లో అలీ పాత్రకు స్కోప్‌ లేకపోవడంతో ఆయన్ను నటింపజేయలేదు. అయ్యప్పనుమ్ రీమేక్ మరియు హరిహర వీరమల్లు సినిమాల కథలు కూడా అలీ పాత్రకు స్కోప్ లేకపోవడంతో పవన్.. అలీ ల కాంబోను చూసే అవకాశం లేదు. కాని హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాలో మాత్రం అలీ కి ఫుల్ లెంగ్త్‌ పాత్రను ఇచ్చినట్లుగా తెలుస్తోంది. గబ్బర్ సింగ్ సినిమాలో ఎలా అయితే పవన్‌ తో ట్రావెల్‌ అయ్యే పాత్ర చేశాడో ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రను హరీష్‌ శంకర్ రాసినట్లుగా తెలుస్తోంది.

అలీతో నటించడంను ఎంజాయ్‌ చేస్తానంటూ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పవన్‌ కళ్యాణ్‌ చెప్పుకొచ్చాడు. మద్యలో కొన్ని కారణాల వల్ల గ్యాప్ వచ్చింది. పైగా అలీ జనసేనలో కాకుండా వైకాపాలో జాయిన్ అవ్వడం వల్ల కూడా ఇద్దరి మద్య గ్యాప్ వచ్చిందని వార్తలు వచ్చాయి. కాని రాజకీయాలతో సంబంధం లేకుండా అలీ ఇంట వేడుకలో పవన్‌ ఇటీవల హాజరు అయ్యి మా మద్య ఎలాంటి విభేదాలు లేవు అంటూ చెప్పకనే చెప్పాడు. దాంతో హరీష్‌ శంకర్ మూవీలో పవన్‌ తో అలీ మళ్లీ సందడి చేయడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
Tags:    
  • Power Star Pawan Kalyan 
  • Harish Shankar 
  • Tollywood 
  • Telugu News 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS