రీమేక్‌ షూట్‌ కు బ్రేక్‌ ఇచ్చిన పవన్‌.. నెక్ట్స్‌ ఏంటీ?

Update: 2021-02-21 05:10 GMT
పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూనే మరో వైపు సినిమా షూటింగ్‌ ల్లో పాల్గొంటున్నాడు. అది కూడా మునుపటి కంటే మరింత జోష్‌ తో షూట్‌ లకు హాజరు అవుతున్నాడు. ఇప్పటికే వకీల్‌ సాబ్‌ షూటింగ్‌ కు గుమ్మడి కాయ కొట్టేసిన పవన్‌ నిన్నటి వరకు మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌ రీమేక్‌ షూటింగ్‌ లో పాల్గొన్నాడు. 24 రోజుల కంటిన్యూ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. ఇప్పటి వరకు రీమేక్ 60 శాతం మేరకు షూటింగ్‌ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. రెండు వారాల పాటు రీమేక్‌ షూటింగ్‌ కు పవన్‌ బ్రేక్‌ ఇచ్చినట్లుగా యూనిట్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పవన్‌ బ్రేక్‌ ఇచ్చిన సమయంలో రానాతో పాటు ముఖ్య నటీనటుల కాంబో సీన్స్‌ ను దర్శకుడు సాగర్‌ చంద్ర చిత్రీకరించబోతున్నాడు. ఇక ఈ గ్యాప్‌ లో క్రిష్‌ దర్శకత్వంలో నటించేందుకు పవన్‌ డేట్లు ఇచ్చాడటని తెలుస్తోంది. క్రిష్‌ గత కొన్ని నెలలుగా పవన్‌ డేట్ల కోసం వెయిట్‌ చేస్తున్నాడు. ఎట్టకేలకు రేపటి నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు ఓకే చెప్పడంతో క్రిష్ అన్ని ఏర్పాట్లు చేశాడు. దాదాపుగా పది రోజుల పాటు క్రిష్‌ దర్శకత్వంలో సినిమా షూటింగ్‌ లో పవన్‌ పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మళ్లీ అయ్యప్పనుమ్‌ రీమేక్‌ లో జాయిన్‌ అవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఎక్కువ గ్యాప్‌ ఇవ్వకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను పూర్తి చేస్తూ పవన్‌ దూసుకు పోతున్నాడు.




Tags:    

Similar News