ట్రెండీ టాక్‌: ప‌వన్ కోసం హ‌రీష్ 'జాతీయ వాదం'?

Update: 2021-04-04 11:30 GMT
గ‌బ్బ‌ర్ సింగ్ రిలీజైన చాలా గ్యాప్ త‌ర్వాత‌ పవన్ కళ్యాణ్- హ‌రీష్ శంక‌ర్ తిరిగి రీయునైట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఈ జోడీ రిపీట‌వుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెర‌కెక్క‌నుంది. హరీష్ ఇప్పటికే స్క్రిప్ట్ ను రెడీ చేసి ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల‌తో బిజీగా ఉన్నారు.

తాజా స‌మాచారం మేర‌కు.. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం జూన్ లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. హరి హర వీర మల్లు త‌ర్వాత‌ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ షూటింగుని పూర్తి చేసిన తరువాత హ‌రీష్ తో సినిమాని ప్రారంభిస్తార‌ట‌.

హరీష్ ఈసారి రొటీన్ మాస్ క‌థాంశంతో కాకుండా యూనివ‌ర్శ‌ల్ ఎలిమెంట్ తో ప్ర‌యోగం చేస్తార‌ని టాక్ వినిపిస్తోంది. ప‌వ‌న్ ప్ర‌స్తుత ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు.. జాతీయవాదం అన్న ఎలిమెంట్ తో సందేశాత్మ‌క‌ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కిస్తార‌ట‌. తారాగణం స‌హా సాంకేతిక నిపుణుల్ని ఫైన‌ల్ చేయాల్సి ఉంద‌ని తెలిసింది.
Tags:    

Similar News