• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా...

పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా మారిపోయిన కత్తి మహేష్...!

By - Tupaki Desk
Update: 2020-07-22 14:30 GMT
కత్తి మహేష్ గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు సినీ క్రిటిక్ గా కేవలం మీడియా సర్కిల్స్ లో మాత్రమే తెలిసిన మహేష్ కత్తి బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి బాగా ఫేమస్ అయ్యాడు. ఇక వివాదస్పద కామెంట్స్ తో ట్వీట్స్ తో ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వచ్చాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. అయినా సరే ఇవేమీ లెక్క చేయని కత్తి మహేష్.. పవన్ కళ్యాణ్ పై కామెంట్స్ ఎక్కుపెడుతూనే వచ్చారు. పవన్ వ్యక్తిత్వం మరియు రాజకీయ వ్యవహారాల పైనా అభిమానుల పైనా విమర్శలు చేసారు.

పవన్ కళ్యాణ్‌ పై చీటికి మాటికి సెటైర్స్ వేస్తూ ఉండే కత్తి మహేష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి డై హార్డ్ ఫ్యాన్ గా మారిపోయారు. అది రియాలిటీలో అనుకుంటే పొరపాటే. 'పరాన్నజీవి' అనే సినిమాలో మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ అభిమానిగా నటిస్తున్నారు. 'పరాన్నజీవి' సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై సెటైరికల్ గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి 'బిగ్ బాస్' కంటెస్టెంట్ నూతన్ నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఒక సాంగ్ మరియు షకలక శంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా కత్తి మహేష్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. 'మహేష్ కత్తి - ది పీకే ఫ్యాన్' అంటూ రిలీజైన ఈ పోస్టర్ లో కత్తి మహేష్ జేబుపై పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ఉండటం విశేషం.

పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు ఏదో కామెంట్ చేసే మహేష్ కత్తి 'పరాన్నజీవి'లో నటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇదిలా ఉండగా కత్తి మహేష్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'పవర్ స్టార్' సినిమాలో జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నాడు. మొత్తం మీద కత్తి మహేష్ అటు పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తూనే మరోవైపు రామ్ గోపాల్ వర్మకి కౌంటర్ గా తీస్తున్న సినిమాలో కూడా నటిస్తూ తన కత్తికి రెండు వైపులా పదునుందని నిరూపిస్తున్నాడు.
Tags:    
  • Paranna Jeevi 
  • Kathhi mahesh 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS