పలాసకు ఓటీటీలో కూడా నిరాశ!

Update: 2020-05-03 04:50 GMT
కొన్ని సినిమాలు చూస్తే సాధారణంగా కనిపిస్తాయి. కానీ బ్లాక్ బస్టర్ అవుతాయి.. ఎందుకు అంత పెద్ద హిట్టు అయిదంటే విశ్లేషించడానికి ఎవరైనా జుట్టు పీక్కోవాలి.  ఒక్కోసారి అందరూ సినిమాను  'న బూతో నా మసాలా ఇది అసలు సిసలు సినిమా' అంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు అద్భుతః అంటారు. అయినా ఆ సినిమా ఆదరణకు నోచుకోదు.  కాసులు రాల్చదు. 'మనమంతా' లాంటి సినిమాలు ఈ సెకండ్ కేటగిరీలో ఉంటాయి. రెండు మూడు నెలల క్రితం విడుదలైన 'పలాస' కూడా ఇదే కేటగిరీ అని చాలామంది అన్నారు.  రిజల్ట్ కూడా సేమ్ టు సేమ్.

ఈ సినిమాకు సురేష్ ప్రొడక్షన్స్ లాంటి అగ్ర శ్రేణి నిర్మాణ సంస్థ బ్యాకింగ్ ఇచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది.  ఈ చిత్రాన్ని హోల్ సేల్ గా కొనుగోలు చేసిన మీడియా 9 వారికి అటు థియేట్రికల్ గా వర్క్ అవుట్ కాలేదు.. ఇటు ఓటీటీ నుంచి కమర్షియల్ గా వర్క్ అవుట్ అవ్వ‌డం లేదని ట్రేడ్ టాక్.  దీనికి కారణం ఈ సినిమా కేవ‌లం కొన్ని వ‌ర్గాలు.. కొన్ని ఏరియాల ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే ఆకట్టుకోవడమని అంటున్నారు. తెలంగాణా ప్రాంతం వారిలో ఎక్కువమందికి ఈ భాష అర్థం కావడం కష్టమని.. దీంతో కొంత మంది ప్రేక్షకులు దూరమయ్యారని అంటున్నారు. అలాగే స్టార్ కాస్టింగ్ లేకపోవడం కూడా మైనస్ గా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  ఈ సినిమాలో హీరోగా కు మంచి అనుభవం ఉన్న నటుడు కావాలి. అయితే ఇప్పుడిప్పుడే నటనలో ఓనమాలు దిద్దుతున్న 'లండన్ బాబులు' హీరో రక్షిత్ ను ఎంచుకోవడం కూడా ప్రేక్షకులను డిస్కనెక్ట్ చేసిందని అంటున్నారు.

అందరూ కరోనా సమస్యతో ఇబ్బందులు పడుతున్న ఈ సమయంలో ఇలా సీరియస్ కంటెంట్ తో కొన్ని వర్గాలను మాత్రమే మెప్పించేలా సినిమాను అందరూ చూసేందుకు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దానికి తోడు ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కూడా డార్క్ గా ఉండడంతో ప్రేక్షకులు 'పలాస' వైపు చూడడం లేదని అంటున్నారు.  ఈ సినిమాతో మీడియా 9 కు ఒటీటీలో కూడా నష్టాలు తప్పడం లేదట.  గతంలో 'రాజావారు రాణివారు' సినిమాతో కూడా ఈ సంస్థకు నష్టాలు తప్ప లేదని అంటున్నారు. ఇలా అయితే ఈ సంస్థ కొత్త సినిమాలపై పెట్టుబడులు పెట్టేది అనుమానమేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News