• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సిరివెన్నెల రాసిన 'పక్కా...

సిరివెన్నెల రాసిన 'పక్కా కమర్షియల్' టైటిల్ సాంగ్ గ్లిమ్స్..!

By - Tupaki Desk
Update: 2022-01-31 10:55 GMT
టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ చిత్రాల స్పెసిలిస్ట్ మారుతి దర్శకత్వంలో మ్యాచో హీరో గోపీచంద్ - బబ్లీ బ్యూటీ రాశీఖన్నా జంటగా నటిస్తున్న తాజా సినిమా ''పక్కా కమర్షియల్''. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ - యూవీ క్రియేష‌న్స్ సంస్థలు క‌లిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందన తెచ్చుకుంది.

''పక్కా కమర్షియల్'' ఫస్ట్ లుక్ - ఫస్ట్ గ్లిమ్స్ మరియు టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో సినిమా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా పాట గ్లిమ్స్ ని వదిలారు. 'పక్కా పక్కా పక్కా కమర్షియల్..' అంటూ వచ్చిన ఈ వీడియో అలరిస్తోంది.

సాంగ్ కి తగ్గట్టుగా ఇందులో గోపీచంద్ మెడలో డబ్బుల దండతో.. కరెన్సీ నోట్లు ప్రింట్ చేయబడిన షర్ట్ ధరించి కనిపిస్తున్నారు. ఇందులో గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపిస్తూనే.. సింపుల్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేయడమే కాదు.. సింగర్ హేమచంద్రతో కలిసి ఆలపించారు.

పక్కా కమర్షియల్ టైటిల్ సాంగ్ కు దివంగత లెజండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించారు. ఇది సిరివెన్నెల కలం నుంచి జాలువారిన మరో అక్షరమాల అని మేకర్స్ పేర్కొన్నారు. సిరివెన్నెల రాసిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఇదే. 'జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు' అంటూ జీవిత సారాంశం వివరించేలా ఈ గీతానికి సాహిత్యం రాశారు.

పక్కా కమర్షియల్ పూర్తి పాటను ఫిబ్రవరి 2వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. గోపీచంద్ శైలి యాక్షన్ - మారుతి మార్క్ వినోదాన్ని సందేశాన్ని కలబోసి ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. స‌క్సెస్ ఫుల్ ప్రొడ్యూస‌ర్ బ‌న్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. SKN సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

రవీందర్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్బీ ఉద్ధవ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న 'పక్కా కమర్షియల్' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Full View
Tags:    
  • Pakka Commercial 
  • Gopichand 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS