• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘పద్మావత్’కు అది పెద్ద...

‘పద్మావత్’కు అది పెద్ద దెబ్బే..

By - Tupaki Desk
Update: 2018-01-10 05:00 GMT
మొత్తానికి ‘పద్మావత్’గా మారిన ‘పద్మావతి’ సినిమా విడుదలకు మార్గం సుగమమైంది. దీనికి సెన్సార్ అడ్డంకులు తొలగిపోయాయి. ఈ చిత్రాన్ని జనవరి 25న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ నిజంగా ఈ సినిమా ఆ తేదీకి వస్తుందా రాదా అన్నది ఇంకా సందేహంగానే ఉంది. ఎందుకంటే సెన్సార్ బోర్డు అనేక అభ్యంతరాలు లేవనెత్తి.. చివరికి కొన్ని మార్పులు.. కోతలతో సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినప్పటికీ.. ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న కర్ణి సేన శాంతించట్లేదు. ఈ సినిమాను ఆడనివ్వబోమని.. థియేటర్లను తగులబెడతామని మరోసారి హెచ్చరించింది. దీంతో విడుదల సమయానికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న ఆందోళన చిత్ర బృందాన్ని వెంటాడుతోంది.

ఇలాంటి అనిశ్చితి మధ్య సినిమాను రిలీజ్ చేయాల్సి రావడం సంజయ్ లీలా బన్సాలీకి  తీవ్ర ఇబ్బందిని కలిగించే విషయమే. నిజానికి ‘పద్మావతి’ ట్రైలర్ చూసి అందరూ షాకైపోయారు. ఓ అద్భుత దృశ్యకావ్యం చూడబోతున్న అనుభూతికి లోనయ్యారు. దీనికి విపరీతమైన హైప్ వచ్చింది. ఆ హైప్ ఉన్నపుడే సినిమా రిలీజై ఉంటే కథ వేరుగా ఉండేది. ఇప్పుడు సినిమాలో కొన్ని సన్నివేశాలకు కోత పడ్డాయి. ఈ వివాదం చాన్నాళ్లు కొనసాగడంతో జనాలకు కొంత విసుగొచ్చింది. ఈ క్రమంలో సినిమాపై ఆసక్తి కొంచెం తగ్గింది. ఐతే ఆ ఆసక్తిని.. హైప్ ను పెంచాలంటే.. గట్టిగా ప్రమోషన్లు చేయాలి.. సినిమాకు సంబంధించి కొత్త ప్రోమోలు వదలాలి. కానీ ఇప్పుడున్న సెన్సిటివ్ సిచువేషన్లో అలా చేసే పరిస్థితి లేదు. ప్రమోషన్ల హోరు కనిపిస్తే ఈ సినిమాను వ్యతిరేకిస్తున్న వాళ్లను మళ్లీ రెచ్చగొట్టినట్లవుతుంది. కాబట్టి వాళ్లకు ఈ సినిమా మీద ఫోకస్ పడనివ్వకుండా.. స్తబ్ధత కొనసాగించాలి. హడావుడి లేకుండా సినిమాను రిలీజ్ చేయాలి. దీని వల్ల సినిమా ఓపెనింగ్స్ మీద కచ్చితంగా ప్రభావం పడొచ్చని భావిస్తున్నారు.
Tags:    
  • Deepika Padukone 
  • Ranveer Singh 
  • Padmavat 
  • Telugu News 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS