• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పద్మావత్.. పదో రోజు...

పద్మావత్.. పదో రోజు ప్రభంజనం

By - Tupaki Desk
Update: 2018-02-04 07:22 GMT
పద్మావత్ సినిమా రిలీజై పది రోజులు దాటింది. అమెరికాలో ఈ చిత్ర ప్రభంజనానికి ఇంకా తెరపడలేదు. రెండో వీకెండ్లో.. రిలీజైన పదో రోజు అక్కడ ఈ సినిమా మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేయడం సంచలనం రేపుతోంది. ఈ వారం విడుదలైన కొత్త సినిమాల్ని కూడా వెనక్కి నెట్టి రెండో శనివారం ఏకంగా మిలియన్ మార్కును దాటడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

యుఎస్‌ లో ఇప్పటికే ఈ చిత్రం 8 మిలియన్ డాలర్లు వసూలు చేయడం విశేషం. హిందీ సినిమాల్లో ‘దంగల్’ అత్యధికంగా 12 మిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉంది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ 21 మిలియన్ డాలర్లతో ఓవరాల్ గా ఇండియన్ సినిమాల్లో రికార్డు నెలకొల్పింది. ఆ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేరు కానీ.. ‘దంగల్’ రికార్డును ‘పద్మావత్’ బద్దలు కొట్టినా కొట్టేయొచ్చు.

మరోవైపు ఇండియాలో సైతం ‘పద్మావత్’ జోరు కొనసాగుతోంది.  ‘పద్మావత్’ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలు సాగించిన కర్ణిసేన యు టర్న్ తీసుకుని ఈ చిత్రానికి మద్దతుగా నిలిచిన నేపథ్యంలో ఇప్పటిదాకా విడుదల కాకుండా ఉన్న కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా ‘పద్మావత్’ థియేటర్లలోకి దిగింది. కాబట్టి రెండో వారాంతపు వసూళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ మార్కును అందుకునే అవకాశముంది. ఎన్నెన్నో అడ్డంకుల్ని దాటుకుని.. చివరికి అతి కష్టం మీద విడుదలైన ఈ చిత్రానికి అంతిమంగా మంచి ఫలితం రావడం సంజయ్ లీలా బన్సాలీకి గొప్ప ఊరటనిచ్చేదే. ఐతే ఈ సినిమాకు ఆయన ఎదుర్కొన్న ఒత్తిడి అంతా ఇంతా కాదు. కాబట్టి భవిష్యత్తులో మళ్లీ ఆయన ఇలాంటి వివాదాస్పద కథల జోలికి మాత్రం వెళ్లకపోవచ్చు.
Tags:    
  • Deepika Padukone 
  • Padmaavat Movie 
  • Padmaavat Collections 
  • Telugu NEWs 

Similar News

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS