• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: సెన్సేషనల్...

ట్రైలర్ టాక్: సెన్సేషనల్ ‘ప్యాడ్ మ్యాన్’

By - Tupaki Desk
Update: 2017-12-15 10:25 GMT
అమెరికాకు సూపర్ మ్యాన్.. స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ లాంటి సూపర్ హీరోలుంటే మన దేశానికి ‘ప్యాడ్ మ్యాన్’ ఉన్నాడంటున్నాడు అమితాబ్ బచ్చన్. ఇంతకీ ఈ ‘ప్యాడ్ మ్యాన్’ అంటే ఏంటో తెలిస్తే మాత్రం షాకవడం ఖాయం. మహిళలు నెలవారీ రుతుక్రమం సమయంలో వాడే ప్యాడ్లను తక్కువ ఖర్చుతో తయారు చేసి దేశవ్యాప్తంగా సామాన్యులందరూ వాడేలా ఒక విప్లవం తీసుకొచ్చిన వాడే ఈ ‘ప్యాడ్ మ్యాన్’. ఒక అన్ బిలీవబుల్ రియల్ స్టోరీ ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దింది ఆర్.బాల్కి అండ్ టీం. ఇంతకుముందు ఒక సామాజిక సమస్యను వినోదాత్మకంగా చూపించిన మెప్పించిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమకథ’లో నటించిన అక్షయ్ కుమార్.. ఇప్పుడు మరో పెద్ద సమస్య నేపథ్యంలో సినిమా చేసి ఆశ్చర్యపరిచాడు. ‘టాయిలెట్’ కంటే కూడా ఇది సెన్సేషనల్ మూవీ అనడంలో సందేహం లేదు.

మెడికల్ షాపుకి వెళ్లి ప్యాడ్ ఇవ్వండి అని అడగడానికే చాలా మొహమాట పడిపోతుంటారు జనాలు. మహిళల జీవన శైలిలో భాగమైన ఓ కీలకమైన విషయం గురించి ఎప్పుడూ దాపరికమే. ఇలాంటి విషయాలపై ఓపెన్ డిస్కషన్ అవసరమన్న విషయాన్ని గుర్తించి ‘ప్యాడ్ మ్యాన్’ టీం పెద్ద సాహసమే చేసింది. ఇండియాలో ఇలాంటి సినిమా రావడం నిజంగా పెద్ద సాహసమే అంతే కాక చాలా గొప్ప విషయం కూడా. ఈ సినిమా ఎలా ఉంటుందన్నది పక్కన పెడితే.. ఇలాంటి ప్రయత్నం చేసినందుకే హ్యాట్సాఫ్ చెప్పాలి. దర్శకుడి ఆరంభం నుంచి విభిన్నమైన సినిమాలే చేస్తూ వస్తున్న బాల్కి.. ఈసారి కెరీర్లోనే అతి పెద్ద ప్రయోగం చేస్తున్నాడనే చెప్పాలి. ఈ చిత్రానికి అక్షయ్ కుమార్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా. రాధికా ఆప్టే.. సోనమ్ కపూర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. జనవరి 26న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.


Full View
Tags:    
  • Akshay Kumar 
  • Padman Movie 
  • Padman Trailer 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS