వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మన సినిమాకు రెండు అవార్డులు
మరాఠీ సినిమా ది డిసిపుల్ చిత్రానికి వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో రెండు అవార్డులు దక్కాయి. చైతన్య తమ్హానే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఒక యువ సంగీత దర్శకుడి సినీ ప్రయాణం గురించి ఉంటుంది. అతడు జీవితంలో పడ్డ కష్టాలు ఒడిదొడుకులు గురించి సినిమా కథ ఉంటుంది. తన జీవిత లక్ష్యంను చేరుకునేందుకు ఎంతలా కష్టపడ్డాడు అనే విషయాన్ని దర్శకుడు చైతన్య చాలా అద్బుతంగా చూపించాడు. అందుకే ఈ సినిమాకు వెన్నీస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటు దక్కించుకోవడంతో పాటు రెండు అవార్డులు కూడా వచ్చాయి.
ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు తో పాటు ఎఫ్ పీ ఆర్ ఈ ఎస్ ఐ క్రిటిక్స్ విభాగంలో మరో అవార్డును ది డిసిపుల్ సినిమా అందుకుంది. ఈ సందర్బంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ.. ఈ కథ రాసుకోవడం కోసం నేను పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. పడ్డ కష్టంకు అవార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరింతగా కష్టపడేందుకు ఈ సినిమాకు వచ్చిన అవార్డు ప్రోత్సాహకంగా నిలిచిందని పేర్కొన్నాడు. నా సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అన్నాడు. మరాఠీ సినిమా అయినా కూడా జాతీయ అంతర్జాతీయ విమర్శకుల ప్రశంసలు దక్కంచుకోవడం చాలా గొప్ప విషయం. చైతన్య గతంలో తెరకెక్కించిన కోర్టు అనే సినిమాకు కూడా అవార్డు దక్కింది.