బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ ను ట్రై చేస్తున్న మన దర్శకుడు

Update: 2021-04-10 00:30 GMT
బాహుబలి సినిమా తర్వాత మన సినిమాలపై ఉత్తరాది వారికి నమ్మకం ఎక్కువ అయ్యింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా హిందీ ప్రేక్షకులు తెలుగు సినిమాలను విపరీతంగా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు దర్శకులు ఎంతో మంది ప్రస్తుతం బాలీవుడ్‌ లో సినిమాలు చేస్తున్నారు. ఇక కొన్ని తెలుగు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అయ్యి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. ఈ కారణాల వల్ల బాలీవుడ్‌ స్టార్స్ పలువురు సౌత్‌ దర్శకులతో వర్క్‌ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. షారుఖ్‌ ఖాన్‌ త్వరలో ఒక సౌత్‌ డైరెక్టర్‌ మూవీలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఇక సల్మాన్‌ ఖాన్‌ తో కూడా ఒక సౌత్‌ డైరెక్టర్‌ అది కూడా మన తెలుగు దర్శకుడు వర్క్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది.

సల్మాన్‌ ఖాన్‌ కు తగ్గ స్టోరీని రెడీ చేసిన ఆ దర్శకుడు ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. త్వరలోనే తెలిసిన వారి ద్వారా సల్మాన్ ఖాన్‌ ను కలిసి కథను చెప్పేందుకు మన దర్శకుడు సిద్దం అవుతున్నాడట. మాస్ ఫ్యామిలీ కథలను ఇష్టపడే సల్మాన్ ఖాన్‌ ఖచ్చితంగా ఈ కథకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సౌత్‌ దర్శకులపై ఉన్న నమ్మకంతో ఆయన ఈ సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలుగు లో హిట్‌ అయిన సినిమాలు ప్రస్తుతం హిందీలో రీమేక్ అవ్వడం ట్రెండ్‌ గా వస్తుంది. అందుకే ఒక తెలుగు సినిమా ను కూడా సల్మాన్ ఖాన్‌ వద్దకు తీసుకు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ సూపర్‌ హిట్‌ మూవీ కనుక సల్మాన్‌ ఖాన్‌ కు నచ్చితే రీమేక్‌ కు ఓకే చెప్పే అవకాశం ఉంది. ఆ రీమేక్ కు కూడా తెలుగు దర్శకుడు దర్శకత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది లో సల్మాన్‌ ఖాన్‌ ఖచ్చితంగా ఒక తెలుగు దర్శకుడితో సినిమాను చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
Tags:    

Similar News