ఉపాసన!! ఇది ప్రమోషనా? ప్యాషనా?

Update: 2018-03-22 10:46 GMT
తెలుగు ఆడియన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రంగస్థలం. రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న ఈ పీరియడ్ చిత్రం ఉగాది పండుగ ఈ నెల మార్చ్ 18న సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంగరంగవైభవంగా జరిపిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్ తాలూకు మేకింగ్ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఎప్పుడు సోషల్ మీడియా లో యక్టీవ్ గా ఉండే చెర్రీ భార్య ఉపాసన ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో కొంతమంది ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు, మరియు ఫాన్స్ మాట్లాడారు. ఒకరు మాట్లాడుతూ "చాలా ఎక్సయిటింగ్ గా ఉంది. ఈవెంట్ ఎలా జరుగుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. బయట చాలా మంది ఫాన్స్ ఉన్నారు. దాదాపు ఒక 1.5 నుండి 2 లక్షల వరకు ఫాన్స్ ఇక్కడ ఉన్నట్టు తెలుస్తోంది." అని చెప్పగా, మరొక ఆమె వైజాగ్ లో రోజు బీచ్ కు వెళ్తాను కానీ ఎప్పుడూ ఇంతమందిని చూడలేదు,చాలా ఆశ్చర్యంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది. ఒకరైతే 'ఇవాళ అసలు ఉగాది పండుగ కాదు మెగా పండుగ లా ఉంది' అంటూ కితాబిచ్చారు.

రామ్ చరణ్ - ఉపాసన - వైజాగ్ ఒక చార్టెడ్ ఫ్లైట్ లో బయల్దేరి వెళ్లి అక్కడ ఫాన్స్ ని పలకరించడంతో మొదలైన వీడియో - ఉపాసన తన హెయిర్ మరియు మేకప్ మాన్ అయిన శాండీ గురించి చెప్పడంతో ముగుస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా పెద్ద సక్సెస్ అయిన విషయం తెలిసిందే. బీచ్ అంతా ఫాన్స్ తో కళ కళలాడిపోయింది ఆ సాయంత్రం. అయితే ఈ ఈవెంటుకు కూడా ఒక మేకింగ్ వీడియో తీయడం ఉపాసనకే చెల్లింది. కాని ఇది ప్రమోషనా? లేదంటే జస్ట్ ప్యాషనా? అనేది మాత్రం అర్దంకావట్లేదు.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News