• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓటీటీలో కిక్కిచ్చే...

ఓటీటీలో కిక్కిచ్చే సినిమాలొచ్చాయ్

By - Tupaki Desk
Update: 2022-08-21 02:30 GMT
వారం వారం ఓటీటీలోకి కొత్త సినిమాలొస్తున్నాయ్. ఈ వారం స్ట్రీమింగ్ కి వ‌స్తున్న సినిమాల్లో క్రేజీ సినిమాలు కొన్ని ఉన్నాయి. వీటిలో యావ‌రేజ్ టాక్ తో ర‌న్ అయిన ర‌ణ‌బీర్ క‌పూర్ భారీ చిత్రం `శంషేరా` ఉంది. య‌ష్ రాజ్ ఫిలింస్ దాదాపు 150 కోట్ల బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించింది.  పెద్ద తెర‌కు సూట్ కాని ఈ సినిమా ఓటీటీ ల‌వ‌ర్స్ ని బాగానే ఎంట‌ర్ టైన్ చేసే అవ‌కాశం ఉంది. అలాగే దేశ‌వ్యాప్తంగా సినీప‌రిశ్ర‌మ‌ల్ని ప‌ట్టి పీడిస్తున్న పైర‌సీ భూతంపై సినిమా  తమిళ్ రాకర్జ్ ఈ వారం ఓటీటీలోకొస్తోంది. ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల‌కే కాదు ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ అంద‌రికీ న‌చ్చుతుంది. హెవెన్- దురంగ లాంటి చిత్రాలు ఈ వారం విడుద‌ల‌వుతున్నాయి. వారాంతంలో ఆసక్తికరమైన కంటెంట్ తో ఉన్న సినిమాలు వ‌స్తున్నాయి. వీకెండ్ లో ఆస్వాధ‌న‌కు ఈ సినిమాలు ఆడియెన్ కి పుష్క‌లంగా స‌రిపోతాయి.

1. శంషేరా
రణబీర్ కపూర్- సంజయ్ దత్ - వాణీ కపూర్ త‌దిత‌రులు నటించిన `శంషేరా` థియేట‌ర్ల‌లో విఫ‌ల‌మైనా ఇది టీవీల్లో వీక్షించేందుకు మంచి సినిమా అవుతుంద‌ని అంచ‌నా. భారీ బ‌డ్జెట్ మూవీ భారీ యాక్ష‌న్ తో విజువ‌ల్ రిచ్ నెస్ తో అల‌రిస్తుంది. బంధిపోటు కాన్సెప్ట్ కూడా ఆక‌ట్టుకుంటుంది. ఓటీటీ ల‌వ‌ర్స్ కి ఈ హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ మూవీ న‌చ్చుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఇది స్ట్రీమింగు కానుంది.

2. తమిళ్ రాకర్జ్
దేశంలో ఈ పేరు విన‌ని వారు ఉండ‌రు. ప‌రిశ్ర‌మ వ్య‌క్తులే కాకుండా నిరంత‌రం వార్తా క‌థ‌నాల్లో ప్ర‌జ‌లు కూడా వింటున్నారు ఈ పేరు. దేశంలోనే అతిపెద్ద పైరసీ నెట్ వ‌ర్క్ అరాచ‌కాల‌పై సినిమా ఇది. తమిళ్ రాకర్జ్ కుర్చీ అంచున కూచుని వీక్షించ‌ద‌గిన‌ క్రైమ్ థ్రిల్లర్ అని ప్ర‌చారం ఉంది. ఓటీటీలో వీక్షించి ప్ర‌జ‌లే దీనిని చెప్పాలి. త‌మిళ స్టార్ అరుణ్ విజ‌య్ ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ కాప్ పాత్ర‌లో న‌టించారు. ఈ మూవీని ఎక్కడ చూడాలి? అంటే.. సోనీ లివ్ లో వీక్షించేందుకు స్కోప్ ఉంది.

3. దురంగ
క్రైమ్ థ్రిల్లర్ జాన‌ర్ లో ఫ‌ర్వాలేద‌నిపించే సినిమా ఇది.  ద్రష్టి ధామి -గుల్షన్ దేవయ్య నటించిన దురంగ సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ గా టాక్ తెచ్చుకుంది. ఎక్కడ చూడాలి అంటే.. ZEE5లో స్ట్రీమింగుకి వస్తోంది.

4. ది నెక్ట్స్ 365 డేస్‌
పాపుల‌ర్ రొమాంటిక్ క్రైమ్ ఫ్రాంచైజీ `ది నెక్ట్స్ 365 డేస్‌` మూడవ సీజ‌న్ కి రంగం సిద్ధ‌మైంది. ఈ సీజ‌న్ మునుపెన్నడూ లేనంత థ్రిల్లింగ్ గా ఉంటుంద‌ని టీమ్ చెబుతోంది. దిగ్భ్రాంతిని క‌లిగించే ఎలిమెంట్స్ ని తెర‌పై చూపించ‌డం ఇక్క‌డో ట్విస్టు. ఈ సీజ‌న్ ని ఎక్కడ చూడాలి? అంటే.. పాపుల‌ర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగుకి రెడీ చేస్తోంది.

5. హెవెన్
2022 మలయాళ చిత్రం `హెవెన్` ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇందులో సూరజ్ వెంజరమూడు- స్మిను సిజో- సుదేవ్ నాయర్ త‌దిత‌రులు  నటించారు. టైటిల్ కి త‌గ్గ‌ట్టే బోలెడ‌న్ని ట్విస్టులు ఈ థ్రిల్ల‌ర్ లో ఉన్నాయి. ఓటీటీ వీక్ష‌కుల‌కు ప‌ర్ఫెక్ట్ ఆప్ష‌న్. ఎక్కడ చూడాలి? అంటే డిస్నీ + హాట్ స్టార్ దీనిని స్ట్రీమింగ్ చేయ‌నుంది. తెలుగు రాష్ట్రాలు స‌హా హిందీ బెల్ట్ లో థియేట‌ర్ల‌కు వెళ్లి చూడ‌ద‌గ్గ సినిమా ఏదైనా ఉంది అంటే అది కార్తికేయ అన్న టాక్ ఉంది. ఇటీవ‌ల విడుద‌లైన బింబిసార‌- సీతారామం చిత్రాలు తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ని వ‌సూళ్ల‌ను సాధించాయి.
Tags:    
  • OTT 
  • movies 
  • films 
  • Netflix 
  • amazonprime 
  • hotstar 
  • ZEE5 
  • OTTmovies 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS