• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #PSPK28లో పవర్ స్టార్...

#PSPK28లో పవర్ స్టార్ పక్కన ఇంకో స్టార్ ఉండబోతున్నాడా..?

By - Tupaki Desk
Update: 2020-04-10 17:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. రోజూ ఏదొక అప్ డేట్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు. 'అజ్ఞాతవాసి' ఘోర పరాజయం తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకొని ఒకేసారి మూడు సినిమాలను ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. వాటిలో మొదటగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి దిల్ రాజు - బోణీ కపూర్ లు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని బడా నిర్మాత ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. మొఘల్ సామ్రాజ్య కాలంనాటి ముఖ్యమైన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కనుందని సమాచారం. ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా బాలీవుడ్ హాట్ బ్యూటీ జాక్వలిన్ ఫెర్నాండేజ్ నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. పవర్ స్టార్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసిన అనంతరం వచ్చే ఏడాది తన కెరీర్ లో 28వ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించనున్నారు.

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇది రెండో సినిమా కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌ పై అటు ఫ్యాన్స్‌ తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇంతకముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన 'దబాంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందువల్ల ఇప్పుడు రాబోతున్న చిత్రంపై ఫ్యాన్స్ అంతకుమించిన ఆశలను పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంభందించి ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్రతో పాటు మరో ప్రాధాన్యత గల పాత్ర ఉండబోతోందంట. ఈ క్యారెక్టర్ లో టాలీవుడ్ లోని ఒక టాప్ యాక్టర్ నటించబోతున్నాడని సమాచారం. ఈ విషయానికి సంభందించిన అధికారిక ప్రకటన రానప్పటికీ ఫ్యాన్స్ మాత్రం అది ఎవరా అని చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫుల్ మాస్ రోల్ లో కనిపించనున్నాడట. ఎప్పటి నుండో పవర్ స్టార్ ని ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ ఆకలి ఈ సినిమాతో తీరనున్నదని సమాచారం.
Tags:    
  • Star hero 
  • Pawan kalyan 
  • Harish Shankar 
  • Telugu news 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS