• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఊపిరి ఒరిజినల్ ట్రైలర్...

ఊపిరి ఒరిజినల్ ట్రైలర్ చూశారా?

By - Tupaki Desk
Update: 2016-03-17 09:33 GMT
హాలీవుడ్ నుంచి గుట్టు చప్పుడు కాకుండా కథల్ని ఎత్తుకొచ్చేసి సినిమాలు చేసేసి అది తమ ఘనతగా చెప్పుకునే పరిస్థితి లేదిప్పుడు. ఒక చిన్న సన్నివేశం అయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ అయినా సరే.. కాపీ కొడితే ఇట్టే పట్టేస్తున్నారు జనాలు. కాబట్టి ఫ్రీమేక్ కంటే.. అఫీషియల్ గా రీమేక్ చేయడమే బెటరనుకుంది పీవీపీ సంస్థ. అందుకే ఫ్రెంచ్ మూవీ ‘ది ఇన్ టచబుల్స్’ కథతో తెలుగులో సినిమా తీద్దామని వంశీ పైడిపల్లి అంటే.. పద్ధతిగా రీమేక్ రైట్స్ తీసుకున్నారు. బహుశా సౌత్ ఇండియాలో ఓ ఇంటర్నేషనల్ మూవీకి అఫీషియల్ రీమేక్ గా వస్తున్న తొలి సినిమా ఇదే కావచ్చేమో. చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ బిలియనీర్.. ఓ ఆవారా కుర్రాడి సాయంతో అసలైన ఆనందాన్ని పొందే కథాంశంతో తెరకెక్కిన సినిమా ఇది. ఎమోషన్స్ మీద నడిచే ఈ సినిమా మంచి అంచనాల మధ్య ఈ నెల 25న తెలుగు - తమిళ భాషల్లో రిలీజవుతోంది.

ఈ మధ్యే విడుదలైన ‘ఊపిరి’ థియేట్రికల్ ట్రైలర్ కు ఎంత మంచి స్పందన వచ్చిందో చూశాం కదా. మరి ఒరిజినల్ ‘ది ఇన్ టచబుల్స్’ ట్రైలర్ ఎలా ఉందో చూశారో. ఒకసారి దాని మీద కూడా ఓ లుక్కేసి చూడండి. వంశీ పైడిపల్లి.. ఆ సినిమాను ఎంత వరకు కాపీ కొట్టాడో ఏంటో కానీ.. ట్రైలర్ ను కూడా కొంత వరకు దించేశాడు. ట్రైలర్లో దాదాపు సగ భాగం ‘ది ఇన్ టచబుల్స్’ నుంచి తీసుకున్నదే. కార్తికి ఇంటర్వ్యూ జరిగే సన్నివేశం.. అతను తనకు కేటాయించిన గది చూసి ఆశ్చర్యపోయే సీన్.. నాగ్ కాళ్ల మీదికి వేడి నీళ్లు పోసే సన్నివేశం.. ఇంకా కొన్ని షాట్లు ‘ది ఇన్ టచబుల్స్’ ట్రైలర్లోనూ సేమ్ టు సేమ్ ఉండటం విశేషం. సినిమాలో సన్నివేశాలు దించేస్తే ఓకే కానీ.. మరీ ట్రైలర్ కూడా కాపీ కొట్టడం విడ్డూరమే.
Full View
Full View

Tags:    
  • Oopiri Movie 
  • Intouchables Trailer 
  • Telugu NEws 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS