• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్పట్లో ఐదు ఆటలు...

ఇప్పట్లో ఐదు ఆటలు లేనట్లే.. నాలుగు ఆటలే వేస్తారు

By - Tupaki Desk
Update: 2021-07-31 03:32 GMT
సెకండ్ వేవ్ ముగిసి.. మూడో వేవ్ ఉంటుందా? లేదా? అన్న సందేహాల మధ్య.. ప్రభుత్వం పచ్చ జెండా ఊపిని ఇన్నాళ్లకు తెలంగాణలో థియేటర్లు ఓపెన్ కాగా.. ఏపీలో మాత్రం కొన్ని థియేటర్లు మాత్రమే రీఓపెన్ కావటం తెలిసిందే. సామాన్యుడి వినోదంగా చెప్పే ‘సినిమా’ను చూసేందుకు ఎన్ని మాథ్యమాలు ఉన్నప్పటికి.. అంత పెద్ద సిల్వర్ స్క్రీన్ మీద చూస్తే ఆ ఫీలే వేరుగా ఉంటుంది. ఇంట్లో టీవీలో బ్యాక్ టు బ్యాక్ సినిమా చూసినప్పుడు వచ్చే ఫీల్ తో పోలిస్తే.. థియేటర్లో సినిమాను నలుగురితోకలిసి చూసినప్పుడు కలిగే భావోద్వేగం వేరుగా ఉంటుంది.

ఇప్పటికే ఇంట్లోనూ.. మొబైల్ లోనూ.. ల్యాప్ టాప్.. సిస్టంలలో  సినిమాలు చేసేస్తున్న ప్రజలకు థియేటర్లలో చూసే అవకాశం కలిగింది. అయితే.. ఇప్పటికి కరోనా భయం వెంటాడుతున్న వేళ.. తాజాగా సినిమా థియేటర్లకు గతంలో మాదిరి వస్తారా? రారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. ఇలాంటివేళ.. తెరిచిన థియేటర్లు చాలా జాగ్రత్తగా రన్ చేస్తున్నాయి.

కరోనాకు ముందు వరకు చాలా మల్టీప్లెక్సుల్లో ఉదయం 10 గంటలకే షో మొదలయ్యేది. సింగిల్ థియేటర్లలో మాత్రం ఉదయం 11 - 12 గంటల మధ్య మొదటి ఆట పడేది. మల్టీఫ్లెక్సుల్లో ఒక్కో థియేటర్ కనీసం ఐదు షోలు వేసేలా ప్లాన్ చేస్తే.. మామూలు థియేటర్లు మాత్రం నాలుగు షోలకే పరిమితమయ్యేది. ఏదైనా క్రేజీ నటుడి సినిమా విడుదల సందర్భంలో మాత్రం థియేటర్లు ఐదు.. మల్టీఫ్లెక్సులు ఆరు సినిమాలు వేసేందుకు ప్లాన్లు వేసే వారు. అలాంటిది తాజాగా మాత్రం అందరూనాలుగు షోలకు మాత్రమే పరిమితమవుతున్నారు.

మామూలు థియేటర్లతో పోలిస్తే.. గంట ఆలస్యంగా మధ్యాహ్నాం ఒంటి గంట తర్వాతే మల్టీఫ్లెక్సులు ఓపెన్ చేస్తున్నారు. ఎందుకంటే సింగిల్ థియేటర్లకు వెళ్లే ప్రేక్షకులకు.. మల్టీఫ్లెక్సులకు వెళ్లే ప్రేక్షకుల మైండ్ సెట్ కు కాస్తంత తేడా ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు తాజాగా విడుదలైన సినిమాల్లో తిమ్మరసు.. ఇష్క్ మూవీలు పెద్ద సినిమాలు కాకపోవటం.. వాటి హీరోలకు ఉన్న ఇమేజ్.. ప్రేక్షకుల్లో భయాన్ని పక్కన పెట్టి ఉత్సాహంగా థియేటర్లకు వచ్చేంత సీన్ లేకపోవటంతో.. థియేటర్.. మల్టీఫ్లెక్సుల యజమానులు ఆచితూచి అన్నట్లుగా షోలు వేస్తున్నారు.

ఎవరైనా పెద్ద హీరో సినిమా కానీ.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సినిమా విడుదలైతే తప్పించి..ఇప్పుడున్న స్తబ్దత మొత్తం పోదంటున్నారు. అప్పటి నుంచి మాత్రమే మల్టీఫ్లెక్సులు జోరుగా సాగే అవకాశం ఉందంటున్నారు. ఆ రోజు మరెప్పుడన్న మాట పలువురు ప్రేక్షకుల నోటి నుంచి వినిపిస్తోంది. మల్టీఫ్లెక్సుల్లో నాలుగు షోలకు బదులుగా.. ఐదు షోలు వేస్తే అయ్యే ఖర్చు లెక్కలు వేరుంటాయని.. అందుకే నాలుగు షోలకు పరిమితమవుతున్నట్లు చెబుతున్నారు.
Tags:    
  • theatres 
  • 50 percent occupancy 
  • tollywood movies 
  • ticket price 
  • andhra pradesh 

Similar News

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS