నాన్న వల్ల నాకు ఆ అలవాటు పోయింది : ఎన్టీఆర్‌

Update: 2021-09-01 10:30 GMT
ఎన్టీఆర్ అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఆశించినట్లుగా ఊహించినట్లుగానే ఎవరు మీలో కోటీశ్వరులు షో ను చాలా సక్సెస్‌ ఫుల్‌ గా నడిపిస్తున్నాడు. ఎన్టీఆర్‌ మరియు కంటెస్టెంట్స్ మద్య సాగుతున్న ముచ్చట్లు.. ఆటలు అన్ని కూడా ప్రేక్షకులకు వినోదాన్ని కలిగిస్తున్నాయి. కంటెస్టెంట్స్ తో ముచ్చటిస్తున్న సమయంలో తన కుటుంబం గురించి.. తన సినిమాల గురించి తనకు ఇష్టమైన వాటి గురించి పదే పదే ఎన్టీఆర్ చెప్పుకుంటూ ఉన్నాడు. తాజాగా ఒక కంటెస్టెంట్ తో మాట్లాడుతున్న సమయంలో క్రికెట్‌ ఆట చిన్నప్పుడు చూసేవాన్ని కాని ఇప్పుడు మాత్రం పెద్దగా చూసే ఆసక్తి లేదు అంటూ చెప్పాడు.

చిన్నతనంలో నేను క్రికెట్‌ చూస్తున్న సమయంలో నాన్నగారు ఆ మ్యాచ్ అంతా కూడా వీసీఆర్ లో రికార్డు చేయమని చెప్పేవారు. అలా వీసీఆర్ లో రికార్డు చేయాలంటే మొత్తం చూడాల్సి వచ్చేది. అలా రికార్డు అయిన మ్యాచ్ ను నాన్నగారు సాయంత్రం సమయంలో ఇంటికి వచ్చి చూసేవారు. ఆ సమయంలో ఆయనతో మళ్లీ రెండవ సారి అదే మ్యాచ్ ను చూసేవాడిని. అలా ఒక్క మ్యాచ్ ను రెండు సార్లు చాలా రోజులు చూడటం వల్ల క్రికెట్‌ అంటే ఆసక్తి పోయింది. అందుకే టీవీలో క్రికెట్‌ చూసే ఆసక్తి పోయింది అంటూ తన తండ్రిని గుర్తు చేసుకుని.. తండ్రి వల్ల క్రికెట్‌ ను చూసే అలవాటు చిన్నప్పుడే పోగొట్టుకున్నాను అంటూ ఎన్టీఆర్ చెప్పాడు.

ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో ను సక్సెస్‌ ఫుల్‌ గా కొనసాగిస్తున్న నేపథ్యంలో ముందు ముందు కూడా ఆయనే హోస్టింగ్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకోసం ఇప్పటి నుండే అభిమానులు జెమిని టీవీ మరియు షో నిర్వాహకులకు రిక్వెస్ట్‌ పెడుతున్నారు. ఇక ఎన్టీఆర్‌ సినిమాల విషయానికి వస్తే ఆర్ ఆర్ ఆర్‌ సినిమాను ముగించేశాడు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా లో రామ్ చరణ్ తో కలిసి నటించాడు. వచ్చే నెల నుండి జనతాగ్యారేజ్ డైరెక్టర్ కొరటాల శివతో మరోసారి సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆచార్య ను ముగించిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమాను కొరటాల శివ పట్టాలెక్కిస్తాడని సమాచారం అందుతోంది.
Tags:    

Similar News