ఆ హీరోను అరెస్టు చేయాలట.. సోషల్ మీడియాలో ట్రెండింగ్.. ఎందుకలా?
సమాజాన్ని.. సర్కారును ప్రభావితం చేసే మీడియా స్థానంలో సోషల్ మీడియా వచ్చి చేరింది. పబ్లిక్ డిమాండ్ పేరుతో దీనికి ఇస్తున్న ప్రాధాన్యత తక్కువేం కాదు. ఏదైనా ఇష్యూ మీద సోషల్ మీడియాలో రచ్చ మొదలైతే.. అటు అధికారులు.. ఇటు రాజకీయ నేతలు అందరూ అలెర్టు అవుతున్నారు. తిరిగి.. తిరిగి తమ మీద పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విడిగా ఎలా ఉన్నా సరే.. సోషల్ మీడియాలో తమ పేరు ప్రఖ్యాతులకు భంగం వాటిల్లకుండా ఉండేలా వ్యవహరిస్తున్న తీరు ఈ మధ్యన ఎక్కువైంది.
తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న హ్యాష్ ట్యాగుల్లో ఒకటి.. #ArrestPratikGandhi. తన సినిమాలతో ఖండాంతర గుర్తింపు పొందిన ఈ గుజరాతీ నటుడ్ని అరెస్టు చేయాలన్న డిమాండ్ అంత ఎక్కువగా ఎందుకుంది? ఆయన చేసిన నేరం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆయన చేసిన సినిమానే అందుకు కారణమన్న మాట వినిపిస్తోంది.
సినిమా చేస్తేసే అరెస్టు చేయాలా? అంటే.. మనోభావాల్ని దెబ్బ తీస్తే ఊరుకుంటామా?అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ.. గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటించిన కొత్త చిత్రం ‘భవాయి’లో ఏముంది? ఎందుకంత వివాదంగా మారిందంటే.. ఈ సినిమా ఆరంభం నుంచి వివాదం నడుస్తుంటే.. తాజాగా ఆ సినిమా ట్రైలర్ విడుదల చేశాక.. ఈ నిరసనలు మరింత ఎక్కువయ్యాయి. ఇందులోని సన్నివేశాల మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మూవీలో ప్రతీక్ గాంధీ లీడ్ రోల్ లో నటించారు. అక్టోబరు ఒకటిన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.
వాస్తవానికి ఈ మూవీకి తొలుత రావణ్ లీలా అనే టైటిల్ పెట్టారు. అది వివాదాస్పదం కావటంతో దాని పేరును భవాయిగా మార్చారు. ఈ మూవీ ట్రైలర్ ఈ మధ్యన విడుదల కావటం.. అందులోని లవ్ సీక్వెన్స్ ను చూపించే క్రమంలో మతపరమైన మనోభావాలు తీశారన్నది ప్రధాన అభ్యంతరం. అందుకే.. హీరోగా నటించిన ప్రతీక్ ను అరెస్టు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది.
భవాయి అనేది గుజరాతీ జానపద నాటక కళ. దాని ఆధారంగా దర్శకుడు హర్ధిక్ గజ్జర్ భవాయి అనే ప్రేమకథను తీశారు.రావణ పాత్రను హైలెట్ చేసేదిగా ఉంటుందన్న ఆరోపణల్ని కొట్టిపారేస్తున్నారు. కేవలం నాటకం ఆధారంగా ఉండే సన్నివేశాలతో కథపై ఒక అంచనాకు రావటం సరికాదని ప్రతీక్ గాంధీ ప్రేక్షకుల్ని కోరుతున్నారు. తాము ఎవరి మనోభావాల్ని దెబ్బ తీయలేదని స్పష్టం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.