• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అప్పట్లో ఒకడికి భలే...

అప్పట్లో ఒకడికి భలే ఛాన్సులే

By - Tupaki Desk
Update: 2017-01-05 08:39 GMT
‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే కనిపించింది. ఓ వర్గం ప్రేక్షకులు ఈ సినిమాపై బాగా ఆసక్తి చూపించారు. ఐతే ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలకు జనాలు ఎగబడిపోవడం జరగదు. అందుకే తొలి రోజు మార్నింగ్ షోకు రెస్పాన్స్ అంతంతమాత్రంగానే కనిపించింది. కానీ షో అయినప్పటి నుంచి ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరగడం.. మౌత్ పబ్లిసిటీ కూడా బాగుండటంతో కలెక్షన్లు పుంజుకున్నాయి. శని ఆదివారాల్లో సినిమాకు హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీకెండ్ అయ్యాక కలెక్షన్లలో మేజర్ డ్రాప్ ఏమీ లేదు.

ఫస్ట్ వీకెండ్ తో పోలిస్తే ఈ సినిమాకు రెండో వీకెండ్లో కలెక్షన్లు ఇంకా మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నారు. గత మూణ్నాలుగు రోజుల్లో ఈ సినిమా గురించి చాలామంది సెలబ్రెటీలు పాజిటివ్ గా మాట్లాడారు. పబ్లిసిటీ కూడా కొంచెం గట్టిగానే చేయడం కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో సెకండ్ వీకెండ్లో ఈ సినిమాకు కలెక్షన్లు చాలా బాగుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ వారాంతంలో సినిమాలేవీ లేకపోవడం కూడా ‘అప్పట్లో ఒకడుండేవాడు’కు కలిసొచ్చే అంశం. ఒక వీకెండ్లో ఎంత భారీ సినిమాలున్నా సరే.. ముందు వారం చెప్పుకోదగ్గ రిలీజ్ ఒక్కటైనా ఉంటుంది. కానీ ఈ వారాంతంలో మాత్రం అలాంటి సినిమాలేవీ రావట్లేదు. దీంతో సెకండ్ వీకెండ్లో ‘అప్పట్లో ఒకడుండేవాడు’ దంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohith 
  • Sri Vishnu 
  • Appatlo Okadundevadu movie 
  • Telugu NEWs 

Similar News

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

Copyright @2026

Powered by Blink CMS