• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ -...

ఒకే ఫ్రేమ్ లో బాబాయ్ - అబ్బాయ్.. ఖుషీలో ఫ్యాన్స్..!

By - Tupaki Desk
Update: 2022-09-03 08:30 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కల్యాణ్ నిన్న శుక్రవారం పుట్టిన రోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు - సినీ ప్రముఖులు మరియు శ్రేయోభిలాషులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో తాము దిగిన ఫొటోలను పంచుకున్నారు.

చిరంజీవి - నాగబాబు - వరుణ్ తేజ్ - సాయి తేజ్ తదితరులు పవన్ కు శుభాకాంక్షలు తెలిపారు. పవర్ స్టార్ పుట్టినరోజుని పురస్కరించుకుని అభిమానులు సైతం ఆయన పేరుతో ట్రెండ్ చేసి, నెట్టింట సందడి చేశారు. ఇక తన బాబాయ్ కు అబ్బాయ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా స్పెషల్ ఫోటోతో బర్త్ డే విషెస్ అందజేశారు.

''నా గైడింగ్ ఫోర్స్, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు రాబోయే ఏడాది మరింత అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను'' అని రామ్ చరణ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పిక్ ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు.

ఇందులో పవన్ కళ్యాణ్ - రామ్ చరణ్ లతో పాటుగా మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ కూడా కనిపిస్తున్నాడు. ముగ్గురూ చిరు నవ్వులు చిందిస్తూ ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ అడోరబుల్ పిక్ లో వారి మధ్య అనుబంధం స్పష్టంగా కనిపిస్తుంది.

ముగ్గురు మెగా హీరోలని ఒకే ఫ్రేమ్ లో చూసి మెగా అభిమానులు ఆనందిస్తున్నారు. ఈ ఫోటోని ఇతరులకు షేర్ చేస్తూ నెట్టింట వైరల్ చేసేశారు. పవన్ - చరణ్ - వైష్ణవ్ కలిసి ఒక సినిమా చేస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన మరో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో 'వినోదమ్ సీతమ్' రీమేక్ లో నటించాడని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే క్రమంలో వైష్ణవ్ తో కూడా ఓ సినిమా చేస్తారని రూమర్స్ వచ్చాయి. కథ కుదిరితే నటించాడని రెడీ అని పవన్ - చరణ్ గతంలో పలు సందర్భాల్లో చెప్పారు. మరి రాబోయే రోజుల్లో బాబాయ్ - అబ్బాయ్ కలిసి నటిస్తారేమో చూడాలి.

పవన్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నాడు. 'ఆచార్య' లో తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్నారు. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తాడు.

లేటెస్టుగా 'రంగ రంగ వైభవంగా' చిత్రంతో పలకరించిన పంజా వైష్ణవ్ తేజ్.. ప్రస్తుతం సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అక్కినేని నాగార్జున నిర్మించనున్న ఓ మూవీలో వైష్ణవ్ హీరోగా నటిస్తారని చాలా రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • PawanKalyan 
  • RamCharan 
  • VaishnavTej 
  • Tollywood 
  • CineLovers 
  • VarunTej 
  • Chiranjeevi 
  • SaiDharamTej 
  • PawanKalyanBirthdayCelebrations 
  • MovieNews 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS