న‌టి ఎద‌పై అస‌భ్య కామెంట్లు.. ఏం చేసిందో తెలుసా?

Update: 2021-05-20 05:30 GMT
సోష‌ల్ మీడియాలో న‌టీమ‌ణుల‌ను వేధించే ఆక‌తాయిలు అంత‌కంత‌కూ పేట్రేగిపోతూనే ఉన్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది హీరోయిన్ల‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. తాజాగా.. మ‌ల‌యాళ న‌టి, టీవీ హోస్ట్ అవ‌స్తీ శ్రీకాంత్ పై అస‌భ్య కామెంట్ చేశాడో వ్య‌క్తి.

ప్ర‌స్తుతం ప్రెగ్నెంట్ అయిన అవ‌స్తీ.. ఈ విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకునేందుకు ఫొటో షూట్ నిర్వ‌హించింది. ఈ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు. అయితే.. ఓ ఆక‌తాయి మాత్రం అభ్యంత‌ర‌క‌ర‌మైన కామెంట్ చేశాడు.

నీ ఎద భాగం సూప‌ర్ అంటూ కామెంట్ పోస్టు చేశాడు. దీంతో.. ఘాటుగా స్పందించింది అవ‌స్తీ. ''అవును నావి సూపర్ గానే ఉన్నాయి. ఎందుకంటే బిడ్డ‌కు పాలివ్వాలి. మాతృత్వంలో ఉండే మాధుర్యం నాకు మాత్ర‌మే కాదు. మ‌హిళ‌లు అంద‌రికీ అదే ఫీలింగ్ుంటుంది. చివ‌ర‌కు నీ అమ్మ‌కు కూడా అలాగే ఉంటుంది. అదేవిధంగా సూప‌ర్ గా ఉంటాయి'' అంటూ సమాధానం ఇచ్చింది.

దీంతో.. మారు మాట్లాడ‌లేక‌పోయాడు ఆ వ్య‌క్తి. అవ‌స్తీ ఇచ్చిన స‌మాధానంపై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నాయి. ఇలాంటి ప‌నికిమాలిన బ్యాచ్ కు ఇలాగే కౌంట‌ర్ ఇవ్వాల‌ని మెచ్చుకుంటున్నారు.
Tags:    

Similar News