EMK సెట్ లో RRR గెట‌ప్ తో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాడా?

Update: 2021-07-11 14:31 GMT
వెండి తెర బుల్లితెర రెండు వేదిక‌ల‌పైనా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ దూకుడును ఆపేవాళ్లే లేరు. ఓవైపు ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమాలో న‌టిస్తున్న తార‌క్ త‌దుప‌రి కొర‌టాల‌తో సినిమాకి లైన్ క్లియ‌ర్ చేస్కున్నాడు. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితోనూ అత‌డు సెట్స్ కెళ్లాల్సి ఉంటుంది.

త‌న‌కు ఏమాత్రం గ్యాప్ చిక్కినా బుల్లితెర‌ను తార‌క్ ఏలేస్తున్నాడు. ఇంత‌కుముందు బిగ్ బాస్ తెలుగు తొలి సీజన్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ బుల్లితెర‌ ప్రేక్షకులను `ఎవరు మీలో కోటీశ్వ‌రులు`(EMK) తో మళ్లీ అలరించడానికి సన్నద్ధమవుతున్నారు. అతను ఈ రోజు ఈ రియాలిటీ షో కోసం షూటింగ్ ని ప్రారంభించాడు.

అత‌డు ఈఎంకే సెట్స్ లో ఎలా అడుగుపెట్టారు? అన్నదానికి ప్రూఫ్ గా కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. ఎన్.టి.ఆర్ తన బిఎమ్ డబ్ల్యూ కార్ లో సెట్స్ కి వ‌చ్చారు. ఈ ఫోటోలలో తారక్ ముఖం స్పష్టంగా క‌నిపించ‌లేదు కానీ.. అత‌డే అని అర్థ‌మ‌వుతోంది. ఆర్.ఆర్.ఆర్ సెట్స్ నుంచి అత‌డు వ‌చ్చి వెళుతున్న‌ట్టుగా తెలుస్తోంది.!! త‌దుప‌రి RRR షూటింగుకి వెళ్లాల్సి ఉండ‌గా సెట్స్ ని తార‌క్ విజిట్ చేశార‌ని అర్థ‌మ‌వుతోంది.

ఆర్.ఆర్.ఆర్ ప్ర‌స్తుత గెట‌ప్ ని వ‌దిలి వేస్తే కానీ బుల్లితెర షోని షూట్ చేయ‌డం కుద‌ర‌దు. ఈ నెల 20 వరకు జూనియర్ ఎన్టీఆర్ `ఎవరు మీలో కోటీశ్వ‌రులు?` షూటింగ్ చేయాల్సి ఉండ‌గా.. త‌న షెడ్యూళ్ల‌ను ఎలా ప్లాన్ చేశారు? అన్నది చూడాలి. అలాగే ఈఎంకే షోలో తార‌క్ లుక్ ఎలా ఉండ‌నుంది? అన్న‌దానిపై అభిమానులకు ఒక అంచ‌నా ఉంది. ఇక బుల్లితెర‌పై రెండోసారి అత‌డు భారీ పారితోషికం అందుకుంటున్నార‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ షోకోసం ఏకంగా 10కోట్ల పారితోషికం అత‌డు అందుకుంటున్నాడ‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News