• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అభిమానికి ఎన్టీఆర్ వీడియో...

అభిమానికి ఎన్టీఆర్ వీడియో కాల్!

By - Tupaki Desk
Update: 2021-10-07 03:30 GMT
వెండితెరపై వెలిగే హీరోలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే చాలు, వాళ్లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. తమ అభిమాన హీరో కోసం వాళ్లు ఒక సినిమాను అనేక మార్లు చూస్తారు. ఫైట్లలో .. పాటల్లో .. డాన్సుల్లో తమ హీరో నైపుణ్యం చూసి మురిసిపోతుంటారు. ఆ సినిమా హిట్  కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. అలాంటి అభిమానులను సంతోష పరచడానికి హీరోలు కూడా తమవంతు ప్రయత్నం చేస్తుంటారు. ఈ విషయంలో ఎన్టీఆర్ మరింత ముందే ఉంటారు.

ఎన్టీఆర్ కుటుంబంలో రోడ్డు ప్రమాదాలే విషాదాన్ని నింపాయి. అందువలన ఆయన తన ఫంక్షన్స్ కి వచ్చే అభిమానులను ఈ విషయంలో పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు. ఎవరికి వారు తమ ఇళ్లకు జాగ్రత్తగా చేరుకోవాలని ప్రతి ఫంక్షన్ లోను చెబుతుంటాడు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల ఎన్టీఆర్ అభిమాని 'కొప్పాడి మురళి' రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తూర్పుగోదావరి జిల్లా 'రాజోలు'కు చెందిన అతను తన పనిపై వెళుతూ ఇటీవల ప్రమాదం బారిన పడ్డాడు. అప్పటి నుంచి అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు.

అయితే రోజులు గడుస్తున్నాకొద్దీ  ఆయన కోలుకునే అవకాశాలు తగ్గసాగాయి. ఆయన పరిస్థితి విషమిస్తూ ఉండటం గమనించిన వైద్యులు .. ఆయన మనసుకు బాగా సంతోషం కలిగించే విషయం ఏమిటని అడిగారట. తాను ఎన్టీఆర్ అభిమానిననీ, ఆయనతో మాట్లాడాలనే కోరిక ఎప్పటి నుంచో ఉందనీ .. అయితే ఆ కోరిక నెరవేరలేదని చెప్పాడట. దాంతో ఆ వైద్యులు ఈ విషయాన్ని ఎన్టీఆర్ దృష్టికి తీసుకువచ్చారట. తన అభిమాని ఒకరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి ఎన్టీఆర్ కదిలిపోయారట.

ఆ అభిమానికి ఎన్టీఆర్ స్వయంగా వీడియో కాల్ చేశాడు. తన అభిమాన హీరో వీడియో కాల్ చేయడంతో మురళీ చాలా ఆనందపడిపోయాడు. ఆయనతో ఎన్టీఆర్ కొంతసేపు వీడియో కాల్ మాట్లాడాడు. ఆరోగ్య పరిస్థితిని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదనీ, ఆయన త్వరలోనే కోలుకోవడం జరుగుతుందని ధైర్యం చెప్పాడట. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటికి వస్తాడనే నమ్మకం తనకి ఉందని అన్నాడట. ఆ మాటలు మురళిపై మంచి ప్రభావం చూపించాయనీ, ఆయన ఆ తరువాత సమయాన్ని చాలా సంతోషంగా గడిపాడని అంటున్నారు. అభిమానం ఆయుష్షు పోస్తే .. ఒక నిండు  జీవితాన్ని నిలబెడితే అంతకంటే కావలసినదేవుంటుంది?   
Tags:    
  • NTR 
  • NTR Fans 
  • NTR Video Call 
  • Ntr Fan Health Condition 
  • RRR 
  • NTr30 
  • Ntr Upcoming Movies 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS