త్రివిక్రమ్ కన్నా ముందు దిల్ రాజుతో ?

Update: 2017-10-13 04:07 GMT
వరస హిట్లతో మంచి జోష్ మీదున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. లేటెస్ట్ గా సోదరుడు నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా తీసిన జైలవకుశ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టడంతో ఖుషీగానే ఉన్నాడు. ప్రస్తుతం అటు బిగ్ బాస్ పూర్తవడం.. ఇటు జైలవకుశ హడావుడి ముగియడంతో కాస్త రిలాక్సింగ్ మూడ్ లోకి వచ్చేశాడు.

తారక్ తర్వాత సినిమా ఏమిటన్నది అఫీషియల్ గా చెప్పకపోయినా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయడానికి ముందు నుంచే ప్లాన్ చేసుకుని ఉన్నాడు. త్రివిక్రమ్ ఖాళీ అయిన వెంటనే షూటింగ్ స్టార్ చేసేందుకు రెడీగానే ఉన్నాడు. కానీ ఇప్పుడు అంతకన్నా ముందు దిల్ రాజు ప్రొడక్షన్ లో వేరే మూవీ స్టార్ట్ చేసే ఆలోచన చేస్తున్నాడు. ఎందుకంటే ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇది కంప్లీట్ కావడానికి ఆరు నెలలు పట్టేలానే ఉంది.

పవన్ మూవీ కంప్లీట్ అయితే గానీ త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టే అవకాశం ఉండదు. ఈలోగా ఖాళీగా ఉండకుండా దిల్ రాజు సినిమా చేయాలన్నది ఎన్టీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. ఎప్పుడూ అనుభవం ఉన్న డైరెక్టర్లకే ఛాన్సులిస్తున్న ఎన్టీఆర్ ఈసారి యంగ్ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ ఏదో ఒకటి తేల్చిచెప్పాకనే ఎన్టీఆర్ దీనిపై పక్కగా డెసిషన్ తీసుకునే అవకాశముంది.
Tags:    

Similar News