ఆర్ఆర్ఆర్ : ఎన్టీఆర్ కు ఆ విషయంలో చాలా ఆసంతృప్తి..!
ఎన్టీఆర్.. చరణ్ ల ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్దం అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ అనగానే ఠక్కున వినిపించే పేరు ఆలియా భట్. ఆమె ఎవరికి జోడీ అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెల్సిందే. అల్లూరి సీతా రామ రాజు పాత్రలో నటించిన రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ కనిపించబోతుంది. చరణ్ కు ఆలియాను పెట్టిన జక్కన్న ఎన్టీఆర్ కు మాత్రం హీరోయిన్ పెట్టలేదు అనే విమర్శలు మొదటి నుండి వస్తున్నాయి.
ఆ విషయంలో ఎన్టీఆర్ కూడా అసంతృప్తితోనే ఉన్నాడా అంటే ఔను అన్నట్లుగా తాజాగా వచ్చిన అనీల్ రావిపూడి ఇంటర్వ్యూతో అనిపిస్తుంది. అనీల్ రావిపూడి హీరోయిన్ గురించి ఎన్టీఆర్ ను ప్రశ్నించిన సమయంలో అసలు ఈ సినిమా లో నాకు జోడీగా హీరోయిన్ ఉందా అంటూ రివర్స్ ప్రశ్నించాడు. అంతే కాకుండా ఆ విషయంలో నాకే ఏం క్లారిటీ లేదు.. ఉందో లేదో.. అసలు నా పాత్ర కు హీరోయిన్ తో సంబంధం ఏంటో నాకే అర్థం కావడం లేదని సరదాగా వ్యాఖ్యలు చేశాడు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. అంతే కాకుండా అందంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అన్నట్లుగా ఉండే ఆలియా భట్ ను తోటి హీరో చరణ్ కు జోడీగా పెట్టి తనకు విదేశీ ముద్దుగుమ్మ.. అది కూడా ఆమె హీరోయిన్ అనే విషయంలో క్లారిటీ లేదు. కనుక ఎన్టీఆర్ లో అసంతృప్తి అనేది చాలా కామన్ విషయం. కనుక ఎన్టీఆర్ పాత్రకు జక్కన్న అన్యాయం చేశాడేమో అంటూ కొందరు చర్చించుకుంటున్నారు.
హీరోయిన్ తో పని లేదు.. పాటలతో పని లేదు.. ఖచ్చితంగా ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రకు వందకు వంద శాతం ఎన్టీఆర్ న్యాయం చేసి ఉంటాడు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్. అందుకే జక్కన్న రాజమౌళి హీరోయిన్ విషయంలో ఎన్టీఆర్ కు అసంతృప్తి కలిగినా పర్వాలేదు.. కథానుసారం వెళ్లాలి అనే ఉద్దేశ్యంతో విదేశీ బ్యూటీని ఈ సినిమాలో నటింపజేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకే తరహా టెంపో లో సినిమా గురించి చర్చ జరుగుతూ వస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కొన్ని వందల వేల పుకార్లు సినిమా గురించి సోషల్ మీడియాలో వచ్చాయి. దాంతో ప్రతి ఒక్కరు కూడా సినిమా గురించి చర్చిస్తూ ఉన్నారు.
ఇద్దరు పెద్ద హీరోల సినిమా టాలీవుడ్ లో వచ్చి పదుల సంవత్సరాలు అవుతుంది. కనుక ఈ సినిమా చాలా స్పెషల్. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమా భారీగా విడుదల అవ్వబోతుంది.