• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'...

ఎన్టీఆర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌' ను మించిన మల్టీస్టారర్ చేయబోతున్నాడు!!

By - Tupaki Desk
Update: 2021-04-21 06:30 GMT
భాష ఏదైనా కూడా మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు అనడంలో సందేహం లేదు. భారీ ఎత్తున అంచనాల నడుమ ప్రస్తుతం ఎన్టీఆర్‌.. రామ్‌ చరణ్ లతో ఆర్‌ఆర్ఆర్ సినిమాను రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ఇద్దరు స్టార్‌ హీరోలు ఈ సినిమాలు నటిస్తున్న కారణంగా తెలుగు ఆడియన్స్‌ లోనే కాకుండా ప్రతి ఒక్క సినీ అభిమానిలో కూడా ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే మరిన్ని మల్టీ స్టారర్‌ సినిమాలు త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ లో స్టార్‌ అయిన ఎన్టీఆర్‌ మరియు కోలీవుడ్‌లో సూపర్‌ స్టార్‌ అయిన విజయ్‌ లు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ ను చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ కు చాలా నమ్మకమైన దర్శకుడు అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతంలోనే ఎన్టీఆర్‌ తో ఒక సినిమా ఉంటుందని అట్లీ ప్రకటించిన విషయం తెల్సిందే. తాజాగా వస్తున్న వార్తల నేపథ్యంలో అట్లీ నిజంగానే విజయ్ మరియు ఎన్టీఆర్‌ లతో భారీ మల్టీ స్టారర్‌ సినిమాను చేస్తాడేమో అంటూ అభిమానులు ఆశ పెట్టుకున్నారు.

టాలీవుడ్‌ కోలీవుడ్‌ లోనే కాకుండా ఈ ఇద్దరు హీరోలకు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. కనుక ఇదో భారీ పాన్ ఇండియా మూవీగా రూపొందే అవకాశం ఉంది అంటున్నారు. రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు ఇద్దరు తెలుగు హీరోలు చేస్తున్న సినిమా ఆర్ ఆర్‌ ఆర్‌ ను మించి తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్ మరియు తెలుగు సూపర్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కలిసి చేసే సినిమా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఈ వార్తలు కనుక నిజం అయితే సౌత్ ఇండస్ట్రీలో అతి పెద్ద మల్టీ స్టారర్ గా ఈ సినిమా నిలుస్తుందని అంటున్నారు. విజయ్ మరియు ఎన్టీఆర్‌ అభిమానులు ఈ సినిమా పట్టాలెక్కాలని కోరుకుంటున్నారు. ఈ వార్తలపై అట్లీ స్పందించాలని అభిమానులు డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఆయన స్పందించేనా చూడాలి.
Tags:    
  • RRR Shooting 
  • Rajamouli 
  • RRR 
  • Ram Charan 
  • Ntr 
  • Alluri Seetharamaraju 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Latest Telugu News 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS