• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేటెస్ట్ క్లిక్: అల్ట్రా...

లేటెస్ట్ క్లిక్: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్..!

By - Tupaki Desk
Update: 2021-04-12 10:41 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'టెంపర్' సినిమా తర్వాత వైవిధ్యమైన చిత్రాలను చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. విలక్షణమైన పాత్రలకు తగ్గట్టుగా తన ఫిజిక్ ని గెటప్స్ మరియు లుక్ ని కూడా చేంజ్ చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నాడు. సినిమా సినిమాకి కొత్తగా కనిపిస్తూ వస్తున్న తారక్.. ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. ఎలిజియం బ్యాండ్ నిర్వహిస్తున్న సింగర్ దినకర్ తన టీమ్ తో కలిసి ఎన్టీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. ఇందులో తారక్ చెస్ట్ కనిపించేలా ప్రింటెడ్ షర్ట్ బటన్స్ తీసేసి అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. గడ్డం, మీసాలు ఆయనకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఇలాంటి డ్రెస్ తో ఎప్పుడూ బయటకు రాని ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ కి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, ఎన్టీఆర్ చివరగా 2018లో 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాతో అభిమానులను అలరించాడు. అప్పటి నుంచి దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్ ఆర్' సినిమా చేస్తున్నాడు. దీని కోసం మరో స్టార్ హీరో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి వెనుకాడలేదు. ఈ ఫిక్షనల్ పీరియాడికల్ మూవీలో తెలంగాణ విప్లవ వీరుడు కొమురం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఇంట్రో వీడియో ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా అధికారిక ప్రకటన ఈరోజు వెలువడనుంది. ఇకపోతే తారక్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా అదరగొట్టడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే 'బిగ్ బాస్'కి హోస్ట్ చేసిన అనుభవమున్న ఎన్టీఆర్.. ఇప్పుడు 'ఎవరు మీలో కోటీశ్వరులు' అనే గేమ్ షో ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు.


Tags:    
  • NTR 
  • ultra stylish look 
  • Tollywood 
  • Latest Movies 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS