అప్పీ ఫిజ్: భల్లాలుడికి భలే భలే కమీషన్!

Update: 2019-02-22 17:05 GMT
మంచికి పోతే సంచి పోతుందని మోడరన్ సామెత కానీ మంచి ఐడియాలు ఉంటే.. వాటిని అమల్లో పెడితే మాత్రం కమీషన్ వస్తుంది.   మంచి ఇడియాలు అంటే అనిల్ అంబాని సారు టైపు ఐడియాలు కాదు. అయన అన్నగారు ముకేష్ అంబానీ స్టైల్ ఐడియాలు. మరి మన రానా దగ్గుబాటి ఆ 'అన్నయ్య'ను ఆదర్శంగా తీసుకున్నాడేమోకానీ కమీషన్ వచ్చింది. మరేంటి ఆ కమీషన్ కమామీషు..?

ఈమధ్య మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు పార్లే ఆగ్రో వారితో బ్రాండ్ ఎండార్స్మెంట్ డీల్ కుదిరిందని..  అప్పీ ఫిజ్ బ్రాండ్ కు ఇకపై రెండేళ్ళ పాటు అయన ప్రచారం చేపడతారని ఇప్పటికే మనం చదువుకున్నాం కదా.  ఈ డీల్ కుదిర్చింది.. రానా కు చెందిన క్వాన్ అనే సంస్థ.  హీరో.. హీరోయిన్ల డేట్లు చూడడం.. కొత్తవారిని పరిచయం చేయడం.. సెలబ్రిటీల బ్రాండింగ్ డీల్స్ లాంటివి చూస్తుంది ఈ కంపెనీ.  ఈ సంస్థను మొదట హైదరాబాద్ లోనే స్థాపించినా మెల్లగా చెన్నై లో కూడా ఒక బ్రాంచ్ పెట్టారు.  ఈ సంస్థే ఎన్టీఆర్ - అప్పీ ఫిజ్ డీల్ ను సెట్ చేసిందట.

ఈ డీల్ ద్వారా ఎన్టీఆర్ కు రూ. మూడు కోట్ల రొక్కం ముడుతుందని సమాచారం.  అందులో పది శాతం.. అంటే ముప్పై లక్షలు క్వాన్ కంపెనీ కి కమీషన్ గా ఇవ్వాల్సి ఉంటుంది.  ఒకరకంగా ఈ ఎమౌంట్ రానాకు వచ్చినట్టే కదా.  నటన విషయంలో బాబాయ్ వెంకటేష్ పేరు నిలబెడుతున్న రానా.. బిజినెస్ విషయంలో నాన్నగారు సురేష్ బాబు పేరును నిలబెడుతున్నారు.  ఇక సినిమాల నిర్మాణం చేపట్టి తాతగారు డీ. రామానాయుడు పేరును నిలబెట్టడం మాత్రమే మిగిలి ఉంది.  అది కూడా సాధించాలని కోరుకుందాం.


Tags:    

Similar News