రికార్డుల రాముడికి 15ఏళ్ళు

Update: 2015-11-16 04:27 GMT
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి వంశోద్దారకుడిగా అతని మనవడు జూనియర్ ఎన్.టి.ఆర్ బాలరామాయణం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి నేటికి సరిగ్గా 15సంవత్సారాలయ్యింది. దశాబ్దన్నర కాలంగా ఈ నవయువ తారక రాముడు తాతగారిని తలపిస్తూ తనదైన శైలిలో తెలుగు సినీనాట జెండా ఎగురవేశాడు.

బాలరామాయణం విజయం సాధించిన తరువాత కొన్నాళ్ళకు ఉషాకిరణ్ సంస్థ నుండి నిన్నుచూడాలని ద్వారా యువహీరోగా లాంచ్ అయిన తారక్ ఆ తరువాత స్టూడెంట్ నెంబర్ 1 - ఆది - సింహాద్రి వంటి విజయాలతో బిగ్ లీగ్ లోకి చేరిపోయాడు. ఆ కాలంలో చిరంజీవికి దీటుగా నిలవగలిగే డ్యాన్సర్ గా పేరు సంపాదించుకున్నాడు.    

ఆది - సింహాద్రి సినిమాలకు రికార్డు సెంటర్లలో 50రోజులు - 100రోజులు సెలెబ్రేట్ చేసుకున్నాడు. అంతేకాక తన కెరీర్ లో ఐదుగురు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వడం విశేషం. స్వర ఉచ్చారణలో తాతగారిని తలపిస్తూ యమదొంగ చిత్రంలో చెప్పిన డైలాగ్ అతని సినిమాలకే హై లైట్. ఈ ఏడాది టెంపర్ అందించిన విజయానందంలో వచ్చే సంక్రాంతికి నాన్నకు ప్రేమతో ద్వారా మనముందుకు రానున్నాడు. తారక్ సినీ ప్రస్తానం మొదలై 15సంవత్సరాలు గడిచిన సందర్భంగా తుపాకీ.కామ్ తరుపున శుభాకాంక్షలు.
Tags:    

Similar News