ఎన్టీఆర్: ఆకాశాన్ని తాకిన ఓవర్సీస్ రైట్స్

Update: 2018-11-01 17:20 GMT
నందమూరి బాలకృష్ణ - దర్శకుడు క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి.  ఇప్పటికే ఈ సినిమాలో నటించే ముఖ్యమైన పాత్రల ఫస్ట్ లుక్ పోస్టర్ లు రిలీజయ్యి అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక బాలయ్య అయితే అచ్చుగుద్దినట్టు 'నాన్నగారు' ఉన్నట్టే ఉన్నారు.  ఈ సినిమాను 'కథానాయకుడు'.. 'మహానాయకుడు' అంటూ రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.  ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాల ఓవర్సీస్ రైట్స్ ను ఓ ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 20 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుందట.  ఈ సినిమా రైట్స్ ను దక్కించుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఈ ఏడాది చాలా సినిమాలను పంపిణీ చేశారట.  బాలకృష్ణ ఓవర్సీస్ మార్కెట్ ని బట్టి చూస్తే మాత్రం ఇది షాకింగ్ రేట్ అనే చెప్పాలి.  ఈ ధర ప్రకారం ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు దాదాపు $4.5 మిలియన్ల కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది.   

ఈ లెక్కన రెండూ సినిమాలు సూపర్ హిట్స్ అయితేగానీ పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం లేదని అనుకోవచ్చు.  ఓవర్సీస్ ప్రేక్ష్హకుల్లో దర్శకుడు క్రిష్ కు ఉండే ఫాలోయింగ్ వల్లే ఈ రేంజ్ లో ధర పలికిందని అంటున్నారు.
Tags:    

Similar News