'ఎన్టీఆర్‌' 1+1 ధ‌మాకా ట్రీట్‌

Update: 2018-10-12 03:57 GMT
విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌ న‌ట‌సార్వ‌భౌముడు - అన్న‌గారు ఎన్టీఆర్ జీవితాన్ని రెండు భాగాలుగా వెండితెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు క్రిష్‌. ఈ క్రేజీ ప్రాజెక్టు కోసం బాలీవుడ్‌ లో `మ‌ణిక‌ర్ణిక‌` ప్రాజెక్టునే ప‌క్క‌న పెట్టేశార‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సాగింది. `గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి` త‌ర్వాత త‌న‌ని న‌మ్మి ఈ బ‌యోపిక్‌ ని క‌ట్ట‌బెట్టినందుకు క్రిష్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుని ఈ చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు. వాస్త‌వానికి ఈ బ‌యోపిక్‌ ని ఒకే  సినిమాగా తీయాల‌ని తేజ స్క్రిప్టు రాసుకున్నా - దానిని రెండు భాగాలుగా డివైడ్ చేసింది క్రిష్‌ నే. అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే.

ఎన్టీఆర్ – క‌థానాయ‌కుడు - ఎన్టీఆర్ – మ‌హానాయ‌కుడు రెండు భాగాలుగా ఎన్టీఆర్ బ‌యోపిక్ ని తెర‌కెక్కిస్తున్నారు. సైమ‌ల్టేనియ‌స్‌ గా నాటి యాంబియెన్స్ క్రియేట్ చేసుకుని షూటింగ్‌ ని ప‌రుగులు పెట్టిస్తున్నారు. ఎన్‌బికే ఫిలింస్ అధినేత‌ నంద‌మూరి బాల‌కృష్ణ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీకి రాకుండా నిర్మిస్తున్నారు. దీంతో క్రిష్ ఎంతో ప్లాన్డ్‌ గా ఈ చిత్రాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇదివ‌ర‌కూ ఇరు సినిమాల‌ రిలీజ్ తేదీల్ని లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే.  సంక్రాంతి కానుక‌గా జ‌వ‌న‌రి 9న `క‌థానాయ‌కుడు` - రిప‌బ్లిక్ డే కానుక‌గా జ‌న‌వ‌రి 24న `మ‌హానాయకుడు` చిత్రాల్ని రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అందుకు త‌గ్గ‌ట్టే డెడ్ లైన్ ప్ర‌కారం సినిమాల చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేస్తున్నారు.

ఈ రెండు సినిమాల్ని పూర్తి చేసేందుకు ఇంకా కేవ‌లం 60రోజులు కూడా స‌మ‌యం లేదు. అందుకే బ్యాలెన్స్ షూటింగ్‌ ని క్రిష్ వేగంగా పూర్తి చేస్తున్నారు. దీంతో పాటే ప్ర‌చారం ప‌రంగానూ కొత్త స్ట్రాట‌జీని అనుస‌రిస్తున్నారు. 1+1 ధ‌మాకా ట్రీట్‌ త‌ర‌హాలో క‌థానాయ‌కుడు - మ‌హానాయ‌కుడు టీజ‌ర్ల‌ను దీపావ‌ళి (న‌వంబ‌ర్ 7)కి రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. ఒకే దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అన్న చందంగా ప్ర‌చారం సాగించునున్నార‌ని తెలిసింది. ఆ త‌ర్వాత ఇదే త‌ర‌హాలోనే ట్రైల‌ర్ల‌ను 1+1 రిలీజ్ చేస్తార‌ట‌. అంతేకాదు - ఇక‌పై రిలీజ్ చేసే పోస్ట‌ర్ల‌ను ఇదే తీరుగా క‌థానాయ‌కుడు - మ‌హా నాయ‌కుడు రెండిటికీ ప్ర‌చారం క‌లిసొచ్చే ప్లాన్ చేస్తున్నార‌ట‌. డిసెంబ‌ర్ ఆద్యంతం ప్రణాళికా బ‌ద్ధ‌మైన ప్ర‌చారం ప్లాన్ చేస్తోంది టీమ్‌. 2019 జ‌నవ‌రి ఎన్టీఆర్ అభిమానులకు సిస‌లైన పండుగ‌ను తెస్తుంద‌ని - గొబ్బెమ్మ‌ల పండుగ‌ను ప‌సందుగా సాగించి, అటుపై రిప‌బ్లిక్ డేకి పార్ట్ 2 రూపంలో స్పెష‌ల్ ట్రీట్ ఉంటుంద‌ని చెబుతున్నారు. 
   

Tags:    

Similar News