ఎన్టీఆర్-త్రివిక్రమ్.. జానర్ అదా?

Update: 2017-05-25 08:03 GMT
జూనియర్ ఎన్టీఆర్ వరుసగా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు లైన్లో పెడుతున్నాడు. అతను అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్.. కొరటాల శివలతో సినిమాలు ఓకే చేసిన సంగతి తెలిసిందే. కొరటాలతో ఎన్టీఆర్ ఇప్పటికే పని చేశాడు కాబట్టి.. ఆ సినిమాతో పోలిస్తే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్లో రాబోయే సినిమానే ఎక్కువ ఆసక్తి రేకెత్తిస్తోంది. దశాబ్దం కిందటే స్టార్ డైరెక్టర్ స్టేటస్ సంపాదించిన త్రివిక్రమ్.. ఎన్టీఆర్ తో ఇప్పటిదాకా సినిమా చేయకపోవడం ఆశ్చర్యమే. ఈ కాంబినేషన్ కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు ఎట్టకేలకు ఫలించాయి. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

ఐతే ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆరంభం కావడానికి ఇంకా చాలా సమయం ఉండగానే ఈ సినిమా కథాంశం గురించి ఆసక్తికర కథనాలు వినిపిస్తున్నాయి. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ అని ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ తన గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రానికి కథ ఎంచుకున్నాడట. తారక్ ఇందులో యంగ్ పొలిటీషియన్ పాత్రలో కనిపిస్తాడట. అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కు కూడా ఢోకా ఏమీ ఉండదట. భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అన్న ప్రచారం నేపథ్యంలో ఎన్టీఆరే త్రివిక్రమ్ నుంచి ఇలాంటి కథాంశం కోరుకున్నాడో ఏమో తెలియదు కానీ.. వీళ్లిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమా జానర్ గురించి వస్తున్న వార్తలు మాత్రం జనాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News