సీక్వెల్ కాదు.. మరో మల్టీ స్టారర్
వరుసగా సక్సెస్ లతో దూసుకు పోతున్న దర్శకుడు అనీల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్ 2 కు సీక్వెల్ గా ఎఫ్ 3 ని రూపొందిస్తున్న విషయం తెల్సిందే. వెంకటేష్ మరియు వరుణ్ లు హీరోలుగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి.. పరిస్థితులు అనుకూలిస్తే ఎఫ్ 3 ని ఆగస్టులో విడుదల చేయాలని దర్శకుడు అనీల్ రావిపూడి ఆశ పడుతున్నాడు. సినిమా వెనుక సినిమా ఏమాత్రం ఆలస్యం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న అనీల్ రావిపూడి ఎఫ్ 3 తర్వాత చేయబోతున్న సినిమాల జాబిత చాలా పెద్దగానే ఉంది.
ఇప్పటికే ఈయన బాలయ్యతో ఒక సినిమా చేసేందుకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. రామారావు గారు అంటూ ఆ సినిమా కు టైటిల్ కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో రవితేజతో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ చేసే పనిలో కూడా ఉన్నాడని ఇటీవలే మీడియా వర్గాల్లో టాక్ వినిపించింది. రవితేజ తో అనీల్ రావిపూడి చర్చలు జరిపిన నేపథ్యంలో రాజా ది గ్రేట్ సినిమా సీక్వెల్ అయ్యి ఉంటుందని అంతా భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రవితేజ తో అనీల్ రావిపూడి చేయబోతున్నది సీక్వెల్ కాదట.
రవితేజ కు అనీల్ రావిపూడి ఒక మల్టీ స్టారర్ కథ ను చెప్పాడట. ఆ కథలో రవితేజ తో పాటు ఒక యంగ్ హీరో నటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. యంగ్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు రవితేజ ఓకే చెప్పాడని తెలుస్తోంది. ఎఫ్ 3 సినిమా మాదిరిగా సీనియర్ హీరో యంగ్ హీరో ల కాంబోలో అనీల్ రావిపూడి మల్టీ స్టారర్ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమా లకు మంచి ఆధరణ ఉంది. కనుక అనీల్ ఎఫ్ 3 పూర్తి కాకుండానే మరో మల్టీ స్టారర్ ను లైన్ లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం అందుతోంది.