ఆటలో ఆరితేరిపోయిన బాహుబలి భామ

Update: 2017-02-19 04:34 GMT
నోరా ఫతేహీని టాలీవుడ్ జనాలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టెంపర్ లో చూపించిన బంపర్ అందాల నుంచి బాహుబలి ది బిగినింగ్ లో ఆడి పాడ్డం వరకూ.. ఐటెం సాంగ్స్ చేయడంలో ఆరితేరిపోయింది ఈ భామ. ఆ తర్వాత కూడా ఇలా ఐటెం భామగా బాగానే మెప్పించింది.

ఇప్పుడు మరో రంగంలో కూడా తన ట్యాలెంట్ చూపించేస్తానని చెబుతోంది నోరా ఫతేహి. ఆటలో ట్యాలెంట్ చూపించేస్తోంది. అది కూడా మళ్లీ చిన్నా చితకా ఎందుకులే అనుకుని.. ఏకంగా క్రికెట్ పైనే కన్నేసేసింది. ఓ గేమింగ్ ఎరీనాలో క్రికెట్ ఆడుతున్న ఓ చిన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది ఈ బాహుబలి భామ. ఏ మాటకు ఆ మాటే చెప్పాలి కానీ.. క్రికెట్ మాత్రం కత్తిలా ఆడుతోందిలే. అయినా.. ఈ అందాల భామ రంగంలోకి దిగి బంతిని కొట్టాక.. దాన్ని పట్టుకునే ధైర్యం ఎవరు చేస్తారు చెప్పండి?

పైగా ఈ వీడియోకి ఓ సూపర్బ్ కామెంట్ కూడా పెట్టింది నోరా ఫతేహి. 'కొత్త క్రికెట్ స్టార్ వచ్చేస్తోంది. గెట్ రెడీ' అంటోంది అందాల భామ. క్రికెట్ సంగతి సరే కానీ.. అమ్మడు అలా వంగి వంగి షాట్స్ కొడుతుంటే.. ఎటు వైపు చూడాలో వ్యూయర్స్ కు తెగ కన్ఫ్యూజన్ గా ఉంది. మరి ఈ విషయంలో క్లారిటీ ఎవరు ఇస్తారబ్బా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News