బిగ్‌ బాస్‌ కు వెళ్లి తప్పు చేశాను

Update: 2020-12-03 08:00 GMT
బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 ఆరంభంలో చాలా స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ గా నోయల్‌ ను అంతా అనుకున్నారు. ఆయన ఖచ్చితంగా ఫైనల్‌ 5 అనుకున్నారు. కాని అనారోగ్య కారణాల వల్ల అనూహ్యంగా నోయల్‌ బయటకు వెళ్లి పోయాడు. కనీసం కదలలేని పరిస్థితుల్లో ఆయన ఉండటం వల్ల తప్పనిపరిస్థితుల్లో బయటకు పంపిస్తున్నట్లుగా బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. నోయల్ వెళ్లి పోయే సమయంలో అవినాష్‌ మరియు అమ్మ రాజశేఖర్‌ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసి వెళ్లి పోయాడు. సాదారణంగా బిగ్‌ బాస్‌ నుండి బయటకు వచ్చిన కంటెస్టెంట్స్‌ టీవీ ఛానెల్స్‌ నుండి మొదలుకుని యూటూబ్‌ ఛానెల్స్‌ వరకు అన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. కాని నోయల్‌ మాత్రం ఎక్కువగా కనిపించలేదు.

నోయల్‌ ఏ కారణం వల్లనో కాని మీడియా ముందుకు రాలేదు. ఇటీవల హారిక బ్రదర్‌ వంశీ నేరుగా నోయల్‌ ఇంటికి వెళ్లి సర్‌ ప్రైజ్ ఇచ్చాడు. ఇంటర్వ్యూ ఇవ్వాలని.. బిగ్‌ బాస్ గురించి మాట్లాడాల్సిందిగా వంశీ కోరడంతో మొదట నిరాకరించిన నోయల్‌ ఆ తర్వాత పొడి పొడిగా మాట్లాడాడు. పలు విషయాలను అతడితో షేర్‌ చేసుకున్నాడు. ఈ సందర్బంగా నోయల్‌ బిగ్‌ బాస్‌ పై అనూహ్యంగా కామెంట్స్‌ చేశాడు. బిగ్‌ బాస్‌ జర్నీ ఎలా అనిపించింది అంటూ వంశీ అడిగిన సమయంలో ఎందుకు వెళ్లానా అనిపించింది అన్నాడు.

బిగ్‌ బాస్‌ కు వెళ్లి కొత్తగా ఏమైనా నేర్చుకున్నారా అంటూ వంశీ అడుగగా వెళ్లడమే తప్పు అనిపించింది. కొత్తగా అక్కడ నేర్చుకున్నది ఏమీ లేదన్నాడు. తాను బిగ్‌ బాస్‌ షోకు వెళ్లకుండా ఉండాల్సిందన్నాడు. ఇక సిటీకి నోయల్‌ ఉంటున్నాడు. అందుకు కారణం ఏంటీ అని ప్రశ్నించగా ప్రేమించిన వారికి దగ్గరగా ఉండి దూరంగా ఉండటం కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఇలా దూరంగా ఉంటున్నట్లుగా వేదాంతం దోరణిలో మాట్లాడాడు.
Tags:    

Similar News