రానా 'అరణ్య'ను మర్చిపోతున్నారు

Update: 2020-09-27 10:10 GMT
యంగ్‌ హీరో రానా హీరోగా నటించిన విభిన్నమైన మూవీ 'అరణ్య'. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ ఏడాది ఏప్రిల్‌ 2 తారీకున దేశ వ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. కాని కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా సినిమా విడుదల ఆగిపోయింది. విడుదల చివరి నిమిషంలో ఆగిపోయిన సినిమాలు ఇన్ని రోజులు థియేటర్ల ఓనెన్‌ కోసం వెయిట్‌ చేసి ఇప్పట్లో ఆ అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చి మెల్లగా ఓటీటీ దారి పడుతున్నారు. కొన్ని సినిమాలు చివరి దశలో ఉండగా వాటిని కూడా పూర్తి చేసి ఓటీటీకి ఇస్తున్నారు. కాని రానా 'అరణ్య' సినిమాను మాత్రం ఓటీటీకి ఇచ్చేందుకు సిద్దంగా లేరని తెలుస్తోంది.

థియేటర్లు ఓపెన్‌ అయ్యే వరకు అరణ్య సినిమా అలాగే ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. అయితే ఈ లోపు ప్రేక్షకులు సినిమా గురించి మర్చి పోతున్నారు అనే కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. అరణ్య సినిమా కు ఇప్పటికే ఉన్న క్రేజ్‌ తగ్గింది. ఇప్పటికి అయినా ఓటీటీలో విడుదల చేయకుంటే మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని యూనిట్‌ సభ్యులు మాత్రం సినిమా విడుదల సమయంలో ప్రమోషన్‌ చేస్తే మళ్లీ ప్రేక్షకుల దృష్టిలో పడటం పెద్ద కష్టం ఏమీ కాదని ఓటీటీ లో మాత్రం విడుదల చేయాలనుకోవడం లేదని అంటున్నారట. సల్మాన్‌ రాజ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానా అడవి మనిషి గా కనిపించబోతున్నాడు. రియల్‌ లైఫ్‌ ఇన్సిడెంట్‌ లతో ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
Tags:    

Similar News